ఎటో వెళ్ళిపోయాడు సీతారావుడు..

సీతారావుడూ..అని
పిలిచినట్టున్నాడు *బాలు* డు..
చప్పున పయనమయ్యేడు
పాటల మాంత్రికుడు..
ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి
అని
ఇంతలోనే ఓడి *పోయా* డు..
క్షణ క్షణం అక్షరసేద్యంలో
అక్షర లక్షలు పండించిన రాతగాడు..
ఆదిభిక్షువు వాడినేది కోరేది అని
మొండికేసాడు..
మధ్యలోనే మనని వదిలేసాడు..
ఎదిగిన కొద్దీ ఒదిగే వినమ్రుడు..
తెలుగు గీతాలను దిక్దిగంతాలకు
మోసుకు పోయాడు..
దివినుండి భువికి గంగావతారణం గావించి
తాను ఆ దివికే ఏతించినాడు..

– రాజా కొడుకుల

Leave a Reply