గాజుల గలగల .. కాలిమువ్వల సవ్వడి ..నొసటి సింధూరం

నీ గాజుల గలగలలో వినసొంపైన సంగీతం ఉంది అర్థం చేసుకుంటే,
నీ కాలిమువ్వల సవ్వడిలో గృహలక్షి గా నీ ఆధిపత్యం ఏంటో తెలుస్తోంది అర్థం చేసుకుంటే,
నీ నొసటి సింధూరం లో నా యోగక్షేమాలు కనిపిస్తున్నాయి అర్థం చేసుకుంటే,
నీ మెడలో మెరిసే సౌభాగ్యం నా పనుల ఆటంకాలను తీరుస్తుంది అర్థం చేసుకుంటే,
నీ కాలిమెట్టెల నిండుదనం నీవు వివాహం అయిన మహిళవి అని చెప్పకనే చెబుతున్నాయి అర్థం చేసుకుంటే,
వివాహానికి ఉన్న గొప్పదనం ఏంటో తెలుసా ఈ సౌభాగ్యంలో మహిళ తన భర్తను చూసుకుంటుంది.
ఈ నిండుదనంలో చూసిన భర్తకు తన భార్యలో తనను చూసుకుంటాడు.

– నఫీసా

Leave a Reply