Home » 17 వేల ఐసిఐసిఐ క్రెడిట్ కార్డులు బ్లాక్

17 వేల ఐసిఐసిఐ క్రెడిట్ కార్డులు బ్లాక్

బ్యాంకు అంగీకారం

సాంకేతికత లోపం వల్ల దాదాపు 17 వేల క్రెడిట్ కార్డులు ప్రభావితమైనట్లు ఐసిఐసిఐ బ్యాంక్ అంగీకరించింది. అవి డిజిటల్ మాధ్యమాల్లో ఇతరుల ఖాతాలకు అనుసంధానమైనట్లు తెలిపింది. అయితే, దీన్ని వెంటనే సవరించినట్లు బ్యాంకు తెలిపింది. ఇప్పటివరకు డేటాను దుర్వినియోగపర్చినట్లు తమకు సమాచారం అందలేదని తెలిపింది. ఎవరైనా ఆర్థికంగా నష్టపోతే.. పరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చింది. ప్రభావితమైన కార్డులన్నింటినీ బ్లాక్ చేసినట్లు వెల్లడించింది.

Leave a Reply