Home » ఆసియాలో అత్యంత ధనవంతుడుగా అదానీ

ఆసియాలో అత్యంత ధనవంతుడుగా అదానీ

ఆసియాలో అత్యంత ధనవంతుడు గా అదానీ గ్రూప్‌ ఛైర్మన్‌ అదానీ ఎదిగారు. అదానీ గ్రూప్‌ ఛైర్మన్‌ గౌతమ్‌ అదానీ ఆసియా లోనే అత్యంత ధనవంతుడిగా మళ్లీ నిలిచారు. ఇప్పటి వరకు ఆ స్థానంలో ఉన్న రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ సీఎండీ ముకేశ్‌ అంబానీని ఆయన వెనక్కి నెట్టారు. అదానీ గ్రూప్‌ కంపెనీల షేర్లు పుంజుకోవడం తో అదానీ సంపద భారీగా పెరిగింది. బ్లూమ్‌బర్గ్‌ బిలియనీర్స్‌ సూచీ ప్రకారం 111 బిలియన్ డాలర్లతో అదానీ ప్రపంచ సంపన్నుల జాబితాలో 11వ స్థానంలో నిలిచారు. అంబానీ 109 బిలియన్ డాలర్ల సంపదతో 12వ స్థానంలో ఉన్నారు.

Leave a Reply