సన్నీ ఇంట ‘రాఖీ’ సందడి

  • సన్నీ ఇద్దరు కవల పుత్రులకు రాఖీ కట్టిన కుమార్తె నిష
  • డిజైనర్ వర్మ, సెక్యూరిటీ సలహాదారు ఇబ్రహీమ్ కు రాఖీ కట్టిన సన్నీ
  • పండుగ సంబరాల్లో పాల్గొన్న డానియల్ వెబెర్

బాలీవుడ్ నటి సన్నీ లియోన్ ఇంట రాఖీ పండుగ సందడి నెలకొంది. తన ఇంట్లో పండుగ సంబరాల ఫొటోలను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేశారు. కుటుంబ సభ్యులతో కలసి ఆమె పండుగను ఉత్సాహంగాsunny1 చేసుకుంది. తన స్నేహితుడైన డిజైనర్ రోహిత్ వర్మ, సెక్యూరిటీ సలహాదారు యూసుఫ్ ఇబ్రహీమ్ కు సన్నీలియోన్ రాఖీ కట్టింది.

ఇక సన్నీ దత్తత కుమార్తె నిష.. తన కవల సోదరులకు రాఖీలు కట్టింది. ఇద్దరు కుమారులు, కుమార్తెతో ఉన్న ఫొటోను సన్నీ ఇన్ స్టాగ్రామ్ లో పంచుకుంది. ‘‘అందరికీ సంతోషకరమైన రక్షా బంధన్sunny శుభాకాంక్షలు. నా కుటుంబాన్ని ప్రేమిస్తాను’’ అని పోస్ట్ పెట్టింది. పింక్ షరారా సూట్ లో ఆమె దర్శనమిచ్చింది. పండుగ సంబరాల్లో సన్నీ భర్త డానియల్ వెబెర్ కూడా పాలుపంచుకున్నారు. ఇబ్రహీమ్sunny3కు నిష కూడా రాఖీ కట్టింది. ఏటా రాఖీ పండుగను సన్నీలియోన్ ఘనంగానే జరుపుకోవడం అలవాటు.

Leave a Reply