Suryaa.co.in

Entertainment

బాగుంది.. బ్రో

ప్రతి మనిషికి ఒక భయం దిగులు ఉంటుంది..
నేను లేకపోతే నా కుటుంబం ఏమైపోతుందో..?
నా భార్య పిల్లలకు దిక్కెవరు..?
నా మీద ఉన్న బాధ్యతలన్నీ ఎవరు మోస్తారు ఎవరూ తీరుస్తారు..?
ఈ ప్రశ్నలు ప్రతి మనిషిని వేధిస్తుంటాయి..

వాటన్నింటికీ సమాధానం కాలం..
మనం ఉన్నా లేకున్నా..
ఎవరికి ఇవ్వాల్సిన సమయం ఎప్పుడు జరగాల్సిన బాధ్యతలు అప్పుడు కాలం నెరవేరుస్తూనే ఉంటుంది.
ఈ టైంలో అమ్మాయికి పెళ్లి చేయాలి..
ఈ టైం లోపు అబ్బాయిని సెటిల్ చేయాలి..
ఈ టైం లోపు ఇది చేయాలి.. ఈ టైమ్ లోపు అది చేయాలి… అని ముందే లెక్కలు వేసుకుంటాం..

కాలాన్ని మనం కంట్రోల్ చేయలేం..
కాలమే అన్నింటినీ కంట్రోల్ చేస్తుంది
కాలం ఒకరి సొంతం కాదు..
కాలం ఎవరికోసం ఆగదు..
కాలానికి ప్రపంచానికి మన కుటుంబానికి మనమేదో చేసేస్తున్నాం అనుకుంటాం.
కానీ అన్నింటికి నడిపేది కాలం మాత్రమే..

బ్రో సినిమాలో అంతర్లీనంగా ఉన్న సందేశం..
మనసు పెట్టి చూస్తే ప్రతి ఒక్కరికి తెలుస్తుంది..
ఒక మంచి సందేశాత్మకమైన చిత్రాన్ని
అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా తీశారు..
పవన్ కళ్యాణ్ గారి సినిమాలలో ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు.

– రామిశెట్టి వెంకట సుబ్బారావు

LEAVE A RESPONSE