Suryaa.co.in

Entertainment

“నాటు..నాటు” కు ఆస్కార్ అవార్డ్ ఎంత కష్టం

చంద్రబోస్ గారు 27 రోజులు తీసుకొన్నారు ఈపాట రాయటానికి. ఇందులో వూళ్ళలో వాడే అన్ని తెలుగు పదాలు. తెలుగు పల్లెలలో వుండే సంస్కృతి. ఎంత కష్టం. కీర వాణి గారు చాలా వెర్షన్లు రాయించారుట. రాహుల్ సింప్లీ గంజ్ చేత పాట పాడించి ఇది ఆడిషన్ మాత్రమే సెలెక్ట్ అయితే మళ్లీ పిలుస్తాం అన్నారుట. అంటే ఎన్ని రకాలుగా ట్యూన్లు కట్టారో ఎంత మందితో పాడించారో ఎంత కష్టం.

ఇద్దరు పెద్ద హీరోలు, 150 మంది డాన్సర్ లు,17 రోజుల షూటింగ్, ఎన్ని డాన్స్ మూమెంట్స్, ఎన్ని రిహార్సల్స్, ఎన్ని టేకులు ఫైనల్ గా ఎంత కష్టం. ఒక్క సీన్ కే 100 వెర్షన్లు షూట్ చేసారుట. అన్ని కెమెరాలతో తీసిన అన్ని షాట్స్ ని ఎడిటింగ్ టేబుల్ మీద ‘ బెస్ట్ షాట్ ‘ని తీసుకోవటం ఎంత కష్టం. ఒక 6 నెలలు, దాదాపు 8 మిలియన్ US డాలర్స్ ఖర్చు.

ఇంటర్నేషనల్ గా లాబీఇంగ్ చేయటం ( లాబ్యింగ్ అంటే ప్రొఫెషనల్ పద్దతులలో మార్కెటింగ్ చెయ్యటం.) దానికి తగ్గట్టుగా ఆలోచించటం ముందుకు వెళ్ళటం ఎంత కష్టం. ఇప్పుడు అందరం తెలుగు వారికి గర్వ కారణం. ఇండియన్ సినిమాకి గర్వకారణం అని అందరూ అనుకొంటున్నారు.

– జానకీదేవి

LEAVE A RESPONSE