Suryaa.co.in

Entertainment

సుమనోహరుడు..!

తరంగిణి అంటూ తరంగంలా
దూసుకొచ్చిన సుమనోహరుడు..
తర్వాత గరంగరంగా
కొన్ని చేసి తెరకు దూరం..
కొన్నాళ్ళు బ్రతుకు భారం..
ఈలోగా రాజశేఖర్ వచ్చి
ఆక్రమించి ఆయన స్థానం..
నాటి నుంచి కెరీర్
మిణుకు మిణుకు..
అన్నమయ్య తో
తళుకుబెళుకు..!
మొత్తానికి సుమన్
రియల్ హీమాన్!

నేర్చుకుంది కరాటే..
స్టంట్లలో అగ్గిబరాటే..
సితార తో వెలుగు..
నాటి భారతంలో
నేటిభారతం తో స్టార్ డం..
మధ్యలో అపరాధి..
నిలదొక్కుకున్నాక
మానవత్వం పరిమళించే మంచి మనిషికి స్వాగతం..
అక్కున చేర్చుకున్న
తెలుగు జనం..
పోలీసు పాత్రలకు
పెట్టింది పేరు..
భానుచందర్ తో మైత్రి..
మరో ఇన్నింగ్స్ లో గంగోత్రి..!

ఏడుకొండలూ దిగివచ్చి
రంగుల్లో మెరిసిన వెంకయ్య..
ఆ సుమనోహర రూపంతోనే
మురిసిపోయె దర్శకేంద్రుడి
అన్నమయ్య..
ముందు తీసి ఉంటే అక్కినేనితో కలిసి
ఎన్టీఆర్ వేయాల్సిన పాత్ర..
ఇటు భానుప్రియ..
అటు శ్రీకన్య
నడుమ సుమన్ను చూస్తే
నిజంగా తిరుపతి యాత్ర..
ధగధగా కిరీటం..
భుజకీర్తులు..
బాలు గళం..
సుమన్ రూపం
దివ్యమంగళం!
పతాక సన్నివేశంలో
నాగార్జునతో
పోటీ అభినయం
దారి మళ్లించిన
జీయర్ స్వామి గెటప్పు..
పెళ్లి చేసిన
సాములోరి రూపు..
పల్లకీ మోత..
అదిరిపోయే
బహుపాత్రాభినయం..!
నా పాట మీ నోట..
ఎంత దయ చూపిస్తున్నారు
అన్నమయ్యను
మురిపించిన శ్రీనివాసుడిగా
బిడ్డ ఆకలి తెలిసి
లడ్డు ఇచ్చి తల్లినే పంపిన
వైకుంఠవాసుడిగా
సుమన్ అద్భుత నటన..
దాంతోనే అయ్యింది
అన్నమయ్య సినిమా
సాక్షాత్తు శ్రీనివాసుని
పదఘట్టన..!

ఇక రామదాసు లో
శ్రీరామావతారం
సుమన్ జీవితంలో
మరో తారకమంత్రం..
ఆజానుబాహుడై..
అరవిందదళాయతాక్షుడై..
నీలమేఘశ్యాముడై..
సాక్షాత్తు శ్రీరాముడై
జీవించి..తరించాడు..
సుమనుడు అయ్యాడు
దైవసమానుడు..
గతంలో చేసి ఉంటే
ఆ తప్పు..
వెంకన్న..రామయ్య
ఆ రెండు పాత్రలతో
ఆ పాపం నుంచి
తప్పుకున్నట్టే!
తీరిపోయినట్టే
నాటి ముప్పు!!

ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286

LEAVE A RESPONSE