సినిమా ఆయన కోవెల..మూడు..!

దుర్వ్యసనాలకు బానిసైన
ఓ జమీందార్..
అతగాడికి
ఒక పొగరుబోతు సెక్రెటరీ..
ఇద్దరి మధ్య ఉద్వేగంగా సాగే ప్రేమకథ..
మధ్యలో జమీందారీ కుట్రలు..
అపార్థాలు..అనర్థాలు..
లతా..
ఎందుకు చేసావీ పని..?
ఒక్క ప్రశ్నతో పెడర్థాలు..
ఆసాంతం ఉత్కంఠభరితమైన
మెలో డ్రామా..
ప్రేమనగర్ హంగామా..
కోడూరు(అరికెపూడి) కౌసల్యాదేవి
అక్షరాల కట్టుకు
సెల్యూలాయిడ్ కనికట్టు..
కోవెలమూడి సూర్యప్రకాశరావు
దర్శకత్వ మహిమ..
తెలుగు ప్రేక్షకలోకం దిగ్భ్రమ!

దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు
జనకుడీ దర్శక దిగ్గజం..
తొలినాళ్ళలో యాక్టర్..
కట్ చేస్తే సూపర్ డైరెక్టర్..
షోమాన్ రామానాయుడు
ఇంట దీపం వెలిగించిన ఇంటిపేరు కోవెలమూడి..
స్త్రీజన్మతో చమురు నింపి
ప్రేమనగర్ తో సురేష్ బ్యానర్ వాల్యూ పెంచి..
సూపర్ హిట్టు కొట్టించి..
మరోసారి అదే అక్కినేనికి
అదే వాణిశ్రీని
సెక్రటరీని చేసి..
అదే రామానాయుడికి
మరో సక్సెస్
బహుమతిగా ఇచ్చి..
నవలలు సినిమాలుగా తీస్తూ
కొట్టాడు హిట్టుపై హిట్టు
ఈ దర్శక సామ్రాట్టు!

కోవెలమూడి కుటుంబమే
సినిమా స్కూలు..
ఆయన కొడితే బోణీ..
కొడుకు రాఘవేంద్రుడిది
ఆయన బాణీ..
అదే బడి నుంచి
వచ్చిన బాపయ్య..
సోగ్గాడు సూపరయ్య…
ప్రకాష్ కెమెరా
చూడాల్సిందే కన్నులారా..!
ఆ ఖాందాన్ తో శోభన్ బాబుకి పండింది పంట..
తాసిల్దార్ గారమ్మాయి..
ఇదా లోకం..సోగ్గాడు..
దేవత..హిట్టు మీద హిట్టంట!
మొత్తంగా సినిమా
ప్రకాశరావు పేషన్..
తీసిందల్లా సెన్సేషన్..
ఏయెన్నార్..శోభన్ తో
మంచి కాంబినేషన్..!

ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286

Leave a Reply