టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసు..హైకోర్టు కీలక ఆదేశాలు

హైదరాబాద్‌:టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసుపై రేవంత్‌ రెడ్డి వేసిన పిల్‌పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. డ్రగ్స్‌ కేసులో రాష్ట్ర ప్రభుత్వం ఈడీకి సహకరించట్లేదని, ఈ కేసులో కీలక వ్యక్తుల ప్రమేయం ఉందని పిటిషనర్‌ తరఫు న్యాయవాది రచనారెడ్డి వాదనలు వినిపించారు. డ్రగ్స్‌ కేసులో పత్రాలు, వివరాలను ప్రభుత్వం ఇవ్వట్లేదని ఈడీ జేడీ అభిషేక్‌ గోయెల్‌ కోర్టుకు వివరించారు. దీంతో డ్రగ్స్‌ కేసులో ఎఫ్‌ఐఆర్‌లు, దర్యాప్తు అధికారుల రికార్డులతో పాటు పూర్తి వివరాలను ఈడీకి ఇవ్వాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ‘డ్రగ్స్‌ యువతపై తీవ్ర ప్రభావం చూపుతుందని, దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఈడీకి సహకరించాలని హైకోర్టు వ్యాఖ్యానించింది.

Leave a Reply