తరలించుకుపోయే మృతువాగదు

ఆటుపోట్ల
సినీ జీవనతరంగాలు దాటి..
ప్రేక్షకుల్లో యమగోల పెట్టించిన తాతినేని..
హిట్టు సినిమాల గని..!

ఒక్కరాత్రిలో దర్శకుడు అయిపోలేదు..
నవరాత్రి కూడా కాదు..
ఎంతో కృషి..
కులగోత్రాలు ఎంచక
అందరు హీరోలతో చెలిమి
ఈ రామారావు బలిమి..!

తాతినేని పటిమకు పరాకాష్ట
అన్న ఎన్టీఆర్ తో యమగోల
అత్యవసర పరిస్థితిపై
వ్యంగ్యాస్త్రాలు..
నాటి రాజకీయ దుస్థితిపై
ఎక్కుపెట్టిన అస్త్రాలు..
నరసరాజు సంభాషణలు
నవరసరాజు రామారావు
అభినయం..
సమరానికి నేడే ఆరంభం..
అద్భుత గేయం..
అంతా తాతినేని మయం..!

బాలీవుడ్ లోనూ
తాతినేని హవా..
అతగాడి అంధాకానూన్ తో
బాలీవుడ్లో అదరగొట్టిన తలైవా…
మొత్తానికి ఈ రామారావు..
హిట్టు సినీమారావు..!

తాతినేని రామారావుకు
నివాళి అర్పిస్తూ..

*ఎలిశెట్టి సురేష్ కుమార్*
9948546286

Leave a Reply