Suryaa.co.in

Entertainment

అతడి పాట బాలీవుడ్ సినిమాకి బాసట!

చమన్ సే భీ ఏక్ ఫూల్
బిఛడాతో క్యా హై..
నయే గుల్ సే గుల్షన్ తో
ఆబాద్ హోంగే
సవేరా కా సూరత్
తుమ్హారే లియే హై..!

ఇదే కిశోర్ కుమార్ తత్వం
అందుకే ఆయన పాటల్లో
అంతటి లాలిత్యం..
గుండెలోని బాధ
గొంతులో ధ్వనించక..
గొంతులోని ఆవేదన
గుండెకు చేరనివ్వక
గలగలా పాడేశాడు..
నా పాట వినే
గుండె కారాదు భారం..
ఆ పాటే బాధను
చెయ్యాలి దూరం..
అలా సాగింది కిశోర్ ఫిలాసఫీ
మురిపించడం..
మరిపించడమే..
ఆయన బయోగ్రఫీ..!.

రుక్ జానా నహీ
తూ కహీ హార్ కే..
కాంటో పే చల్ కే మిలేంగే
సాయే బహార్ కే..
ముసాఫిర్ హు యారో
న ఘర్ హై..న ఠికానా..
ముజే చల్తే జానా హై..
హస్తే గాతే యహా సే గుజర్
దునియాకీ తూ పర్వానకర్!
అలా నవ్వుతూనే పాడాడు..
నవ్విస్తూనే పోయాడు..

బాలీవుడ్ స్వర ప్రపంచాన్ని
ఏలేసిన గొంతు..
రఫీ..మన్నాడే…తలత్..
మహేంద్ర కపూర్..
ఒక్కో గొంతులో
ఒక్కోలాంటి మత్తు..
కిశోర్ గళంలో
ఈ ఎవ్వరిలోనూ
లేని గమ్మత్తు!
ఆ స్వరంతోనే హిందీ సినిమాకి కొన్నేళ్లు
తానే అయ్యాడు సర్వస్వం!
మధుర గీతాలతో
కుర్రకారును పరిగెత్తించిన
స్వరాశ్వం!

కిశోర్ పాటలంటే పిచ్చి..
వింటుంటే అదోలాంటి కచ్చి
వీటిని మించి ‘ఆరాధన’..
రూపు తెరా మస్తానా..
ప్యారు మెరా దీవానా..
భూలు కొయీ
హమ్సేనా హోగయా!
ఈ పాటతో నాటి యూతు
గుండె గల్లంతు..
ప్రేమలో పడితే కిశోర్ పాటే..
రాజేష్ ఖన్నాతో పాటే..
మేరా సప్పనొంకి రాణి
కబ్ ఆయగీతు..
అమ్మాయిలకు బీట్లు కొట్టే
నాటి కుర్రకారుకు
ఈ పాటే ఆసరా..
పిల్ల పడితే అదే దసరా..!

జిందగీ ఏక్ సఫర్
ఏ సూహానా..
యహా కల్ క్యా హో
కిస్నే జానా..
ఊపేసిన ఆ పాట..
అందులో హమ్మింగ్..
ఎప్పటికీ మరొకరికి
సాధ్యం కాని మ్యాజిక్..
అటు కిశోర్..
ఇటు రాజేష్ ఖన్నా
చేరిపోయారు పీక్!

కైఖీ పాను బనారసు వాలా..
అమితాబ్ లేపేసాడు టాపు..
హాఫు కోటుతో టిప్పుటాపు..
పాటతోనే కాదు ఆట..మాటతోనూ
అభినయంతోనూ
ఊపేసాడు కిశోర్..
అధికార్..చుప్రే చుప్..
న్యూఢిల్లీ..భాగం బాగ్..
మిస్ మాలా..నౌక్రీ.. మూసాఫిర్..పడోసన్..
ఈ సినిమాలతోనే
జనాల్ని పడేసన్..!

అందంతో..అభినయంతో
ప్రపంచాన్ని ఆలరించిన
మధుబాల..
సుహానా సఫర్ ఔర్ యే
మోసమ్ హసీ..
అయింది కిశోర్ ప్రేయసి…
గాయకుడై..నాయకుడై
చలాయించాడు హీరోయిజం..
యోగితా బాలీ
పట్టేసింది ప్రేమజోలి..
లీనా చందాతోను
నడిపాడు ప్రేమ కథ..!

హిందీ సినిమా పాటకు
పరుగులు నేర్పి..
గాత్రంతో హీరోలను
సూపర్ స్టార్లను చేశాడు..
చల్ చల్ చల్ మేరా హాధీ
ఓ మెరా సాధీ
ఆ స్వరం పాటకు చిరునామా
మెలోడీకి వీలునామా..
సినిమాకి హంగామా..
విజయానికి తెరనామా..!

ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286

LEAVE A RESPONSE