Suryaa.co.in

Entertainment

ఆ మాలిని..సమ్మోహిని!

ఆమె నవ్వితే..
వెన్నెలే చిన్నబోతుందేమో..

ఆమె కళ్ళు..
కోటి భావాల లోగిళ్ళు..

ఆమె చీరకడితే..
చీరకే అందం..

ఆమె పలుకు..
మకరందం..

ఆమె కులుకు..
దేవకన్యల చందం..!

జీవితంలో ప్రతి ఒక్కరికీ
ఉంటుందేమో
ఓ స్వప్న సుందరి..
ఆమె మొత్తం దేశానికే
డ్రీమ్ గర్ల్..!
వయసుతో పని లేని కలలరాణి..
హేమమాలిని..
బాలీవుడ్ మనోరంజని..!

ప్యాంటు షర్టు తొడిగి
స్కేటింగ్ చేసినా..
పొట్టి లంగా..నెత్తిన చెంగు
పెట్టి గారడీలు కట్టినా..
గుర్రం బండి తోలుతూ
వడవడా వాగినా..
ఈ షన్ను ఏం చేసినా
అదే అందం..
హీరోలు ఆ అందం
కోసం పందెం..!

జిందగీ ఎక్ సఫర్
ఏ సూహానా..
రాజేష్ ఖన్నాతో కలిసి
టూ వీలర్ పై
ఓ సాంగేసుకుంటే
కుర్రకారుకి అదెంత హుషారు..
మహినేలే మహారాజు నీవే..
మనసేలే నెరజాణ నేనే..
అంతటి ఎస్వీఆర్ కే పరవశం..
జోహారు శిఖిఫించ మౌళి..
అలా సమ్మోహనంగా
నర్తిస్తే రంభ..
దేవసభకే కొత్త శోభ..!
హా జబ్ తక్ హై జాన్
మై నాచూంగీ..
గాజు పెంకులపై
సుకుమారి నాట్యం..
చూస్తూ పరాకాష్టలో
గబ్బర్ సింగ్ క్రౌర్యం..!!
షోలే వసూళ్ళు
రికార్డు స్థాయిలో కైంకర్యం!

ఇప్పుడేమో వయసు
డెబ్బై అయిదు..
ఇప్పటికీ అభిమానులు
ఆ కళ్ళలో ఖైదు..
సప్నొంకా సౌదాగర్లో
ఊరించింది..
షోలేలో ఉరికించింది..
సున్హేరా సంసార్లో
ఉడికించింది..
సీతా ఔర్ గీతాలో
ఊపేసింది..
మొత్తంగా
ఈ డ్రీమ్ గర్ల్
దేశాన్ని ఉర్రూతలూగించేసింది..!

– సురేష్ కుమార్ ఇ
9948546286

LEAVE A RESPONSE