బానిసత్వాన్ని బహుమతిగా ఇవ్వొద్దు

అధికారంలోకి రావడానికి పాదయాత్రలో ఇబ్బడి ముబ్బడి హామీలు కులాల కుంపట్లు అలాగే అధికార పార్టీ మీద అసత్య ప్రచారాలు పింక్ డైమండ్లు ,బాబాయి హత్య, కోడికత్తి డ్రామాఇలా అనేక అసత్యాలతో ప్రశాంత్ కిషోర్ ఆధ్వర్యంలో సోషల్ మీడియాను ఆయుధంగా చేసుకొని ప్రజలను నమ్మించి ఒక్క ఛాన్స్ పేరుతో అధికారంలోకి 151 సీట్లతో గద్దెనెక్కిన జగన్ రెడ్డి ఇక తనకి తిరుగులేదు అనుకున్నాడు. ప్రమాణ స్వీకారం రోజు ప్రకృతి హెచ్చరిస్తే మహానేత ఆశీస్సులు అన్నారు.

ప్రజా వేదిక కూల్చడంతో ప్రారంభం అయిన పతనం. మొదటి రెండేళ్లు కరోనా వంకతో అప్పులు చేయడం ప్రజల అకౌంట్ల లో డబ్బులు వేస్తున్నాం అని గొప్పలు చెప్పుకోవడం. సొంత కులం వారికి దాదాపు 1000 మందికి అనేక పదవులు ఇచ్చి ప్రజల సొమ్ముని జీతాలుగా ఇవ్వడం. అలాగే అన్ని కార్పొరేషన్ల నిధులు పథకాలకు మళ్ళించాడు ఆకరికి పంచాయతీల నిధులతో సహా.. ఇక గెలిచిన రోజు నుండి పోలీసులను అడ్డం పెట్టుకొని ప్రతిపక్ష నాయకుల మీద అక్రమ కేసులు,కార్యకర్తల మీద సోషల్ మీడియా కేసులు పెట్టడం కోర్టులలో మొట్టికాయలు తినడం.

ఇసుక ,మద్యం,మైనింగ్, కొండలు గుట్టలు ఇలా ప్రకృతి సంపద దోచేశారు. రాజధాని మీద నాలుక మడతపెట్టి 3 రాజధానులు పేరుతో ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టారు.. నిండు అసెంబ్లీ లో ముఖ్యమంత్రి హోదా పదవి స్థాయి ని మరిచి ప్రతిపక్ష నాయకుడి వ్యక్తిగత కుటుంబ సభ్యులు అయినా, భార్యను కోడలిని తిట్టడం. సాటి ఎమ్మెల్యే లతో తిట్టించాడు.. ఆఖరికి ప్రతిపక్ష పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి చేయించారు.అదే చంద్రబాబు ఒక్క పిలుపు ఇస్తే ఆ రోజు రాష్ట్రం రావణకాష్టం అయ్యేది. కానీ అనేకమంది కార్యకర్తలు మానసికంగా ఆర్థికంగా చితికిపోయి రోడ్డునపడేవారు. ఈ వైసీపీ నాయకులు పెట్టించే కేసులకు . కానీ కార్యకర్తలను కాపాడుకోడం కోసం పార్టీని కాపాడుకోవడం కోసం ఆ పెద్దాయన 36 గంటలు నిరాహార దీక్ష చేసి ప్రజాస్వామ్య బద్ధంగానే నిరసన తెలిపారు.

వైజాగ్ లో జరిగిన సంఘటనకు పవన్ కళ్యాణ్ కి మద్దతుగా ప్రజాస్వామ్యం కాపాడుకోవడం కోసం మన అస్తిత్వాన్ని ఈ రక్కసి మూకల నుండి నిలబెట్టుకోవడానికి పెద్దాయన వెళ్ళాడు. ఒక తెలుగుదేశం కార్యకర్తగా అన్ని పార్టీ కార్యకర్తలకు ,మేధావులు, పత్రికా విలేఖరులు, మరియు సామాన్య ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి….విజ్ఞతతో ఆలోచించండి. రాబోయే తరాలకు బానిసత్వాన్ని బహుమతిగా ఇవ్వొద్దు.. .. రాష్ట్రాన్ని కాపాడుకోవలసిన బాధ్యత అందరిదీ.

– డి

Leave a Reply