Home » కలిసే కళ్ళలోన కురిసే పూలవాన..!

కలిసే కళ్ళలోన కురిసే పూలవాన..!

ఎన్ని ‘పూజ’లు చేస్తే
ఇంకెన్ని ‘నోము’లు నోస్తే..
ఇలాంటి ‘అల్లుడొచ్చాడు’..!

రామకృష్ణ..
పేరులోనే రామ..కృష్ణ
ఇద్దరినీ పొదుగుకున్న
ఈ భీమవరం అందగాడు
రాముడిగా..కృష్ణుడిగా
రామారావు..కాంతారావు
తర్వాత రాణించిన
నిండైన మూర్తి..
పోలీసు..డిటెక్టివ్
పాత్రలకూ పెట్టింది పేరు..
జానపదమూ తన పథమే..
ప్రతిభ బహువిధమే..!

అతడి కెరీర్
‘నిత్యకళ్యాణం పచ్చతోరణం’
కాకపోయినా
‘బొమ్మా బొరుసా’
వేసుకుని వెనక్కి వెళ్ళిపోక
నిలదొక్కుకుని నాయకుడిగా
‘మగాడు’అనిపించుకున్నాడు

గీతాంజలిని మనువాడి
అందానికి అందానివై
అనుకుంటూ
అన్న నందమూరికి..
అక్కినేనికి..కృష్ణంరాజుకు
తమ్ముడుగా సెటిలైన
యశోదాకృష్ణుడు…
మనిషి వెళ్ళినా పరిశ్రమతో
ఎన్నెన్నో జన్మల బంధం..
కెరీర్లో ఎత్తుపల్లాలకు కృంగక
జీవితాల ఆటలోన మనమంతా పావులం..
అని సరిపెట్టుకున్న
సగటు హీరో..!

ఇ.సురేష్ కుమార్
9948546286

Leave a Reply