ఓ మహా దేశానికి
అధ్యక్షుడు
మహా సైన్యానికి అధిపతి
నిజాయితీకి చక్రవర్తి
న్యాయ నిర్ణయంలో సమవర్తి
చెరిగిపోని కీర్తి..
తరిగిపోని యశస్సు
అంతులేని మేధస్సు
మిస్సైల్ మాన్..
రియల్ హ్యూమన్..!
ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి
ఎన్నో చేసి ఎంతో నేర్చి
ఎందరినో మార్చి..
దుర్మార్గాన్ని పరిమార్చి..
కోట్ల హృదయాలను జయించి
కీర్తి శిఖరాలను అధిరోహించి
రాజ్యాంగాన్ని శిరసా వహించి
రాజువై..మచ్చలేని నెలరాజువై..
వెలుగొందిన కలాం
అందుకో మా సలాం..!
క్షిపణి నీ పని..
నీ ప్రయోగం
జాతికి ప్రయోజనం..
సేవ నీ త్రోవ..
నిబద్ధత నీ సంబద్ధత..
ధర్మం నీ ఆయుధం..
నీతి నీ నిరతి..
కలియుగంలో
అరుదుగా కనిపించే నిష్కల్మషుడవు
ఆధునిక భారతంలో
మరో భీష్ముడవు..
హుందా నీ దందా
అందరి బాగే నీ ముసాయిదా
అందుకే భరత జాతి
మొత్తం నీకు ఫిదా..
ప్రపంచ దేశాలకు
తలమానికం ఇండియా
ఈ దేశంలో ప్రతి పౌరుడు
నీ వ్యక్తిత్వానికి తాలియా..!
ఇ.సురేష్ కుమార్
9948546286