మరో తార మరలింది!

రమేష్..నువ్వు చాలా మంచివాడివి..
నీటుగా తెల్లటి సూటు..
చేతిలో స్టయిల్ గా
ట్రిపుల్ ఫైవ్ సిగిరెట్టు..
దొంగల నాయకుడైనా
సిఐడి ఆఫీసర్లా ఫోజు కొట్టు..
అదే బాలయ్య కనికట్టు..!

మొనగాళ్ళకు మొనగాడు..
ఇది కత్తులరత్తయ్య సినిమా
మహానటుడు ఎస్వీఆర్
గూట్లే..డోంగ్రే..
పచ్చి నెత్తురు తాగుతా..
అంటూ విశ్వరూపం..
ఆ మాటున
బాలయ్య స్ఫురద్రూపం..
ఇప్పటికీ గుర్తే..ఎప్పటికీ కీర్తే!

అంతటి ఎస్వీఆర్ అకస్మాత్తుగా మరణిస్తే..
కృష్ణ అల్లూరి సీతారామరాజులో
అగ్గిరాజు పాత్ర..
ఎవరికి దొరలపై దండయాత్ర..
గొడ్డలి చేతికిచ్చి
ఉరకమంటే సూపర్ స్టార్
ఉరకలెత్తిపోయింది
ఆ క్యారెక్టర్..
బాలయ్య అభినయంతో..
గంటన్న గుమ్మడి అనునయంతో..!

పాండవవనవాసంలో
సవ్యసాచి..
శ్రీకృష్ణపాండవీయంలో
ధర్మరాజు..
నేరము..శిక్షలో
పగబట్టిన అంధుడు..
అన్నమయ్యలో కొడుకు కోసం ఆవేదన పడే తండ్రి..
మల్లీశ్వరి జమీందారు తాత..
సినిమా అందమైన శివయ్య
మన బాలయ్య..!

ఇంజనీరింగు చదివి
సినిమాపై మోజుతో
ఇటు మళ్ళి..
నిర్మాతగానూ వర్ధిల్లి..
కళాతపస్వినే కళాత్మక
చిత్రాల దారివైపు నడిపిన
‘అమృత’ హస్తం..
సినిమానే ఆయనకు సమస్తం..
ఎన్నో సెంచరీ సినిమాల్లో
నటించినా నూటికి ఏడు తక్కువగా బొమ్మ ఎత్తేశారు మన మన్నవ..
బ్రతుకుపై తీరిపోయి మక్కువ..
అదేమి చిత్రమో…
సినిమా పడిన రోజే ఎత్తేసినట్టు పుట్టినరోజునే మరణం..స్వామి శరణం!
అభిమాన నటుడు
బాలయ్యకు నివాళి అర్పిస్తూ

*ఎలిశెట్టి సురేష్ కుమార్*
9948546286

Leave a Reply