Suryaa.co.in

Entertainment

అమ్మమ్మమ్మో తెలిసిందిలే..!

ఏ పారిజాతమ్ములీయగలనో సఖీ..గిరిమల్లికలు తప్ప..
గరికపూవులు తప్ప..

జగతిపై నడయాడు
చంచలా వల్లికా..
తరుణి ఆకృతి దాల్చు శరదిందు చంద్రికా..

అలా అందమే
ఆకృతి దాల్చి..
ప్రకృతికాంతగా పోల్చి..
వెండితెరపై జిలుగులతారగా
ఆవిష్కరిస్తే
ఆమె ఏకవీర..!

ఏమీ ఎరుగని గోపాలునికి
ప్రేమలేవో నేరిపిన
కె ఆర్ విజయ..
సొగసుకే లయ..
కదలికే హొయ..!

గోపాలబాల నిన్నే కోరి
నీ సన్నిధి చేరి
నీ చుట్టు తిరుగుతు ఉంటాను..
అఖిలాంధ్రకే అన్న ఎన్టీఆర్
భలేతమ్ముడు గా
సాధువు వేషంలో
రైలెక్కి బుల్లి తంబురా పట్టి..
నీ నామం వింటూ ఉంటే
నిలువెల్లా పులకించేను..
నీ రూపం కంటూ ఉంటే
నన్ను నేనే మరిచేను..అంటూ
భజన చేసింది
ఈ ముద్దు గుమ్మ కోసమే..!
అందాల భామ
రక్తి నుంచి ముక్తి పాత్రలకు
మళ్ళినాక అయింది
ఆదిపరాశక్తి..
బాలయ్య అమ్మగానూ
మెరిసిన నిండైన విగ్రహం..
ఏ పాత్రనూ
చెయ్యలేదు అపాత్రం..
ఇదీ కెఆర్ విజయ ముఖచిత్రం..
ఆమె సోయగంతో మెరిసింది
నటించిన
ప్రతి చలనచిత్రం..!

– సురేష్ కుమార్ ఇ
9948546286

LEAVE A RESPONSE