Home » జగన్ రెడ్డి పీడక – లూఠీ నామ సంవత్సరం 2021

జగన్ రెడ్డి పీడక – లూఠీ నామ సంవత్సరం 2021

-ప్రపంచానికి కరోనా వైరస్ – రాష్ట్రానికి జగనోరస్ 
-టీడీపీ కేంద్రకార్యాలయ కార్యదర్శి, ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు

2021 సంవత్సరం జగన్మోహన్ రెడ్డి పీడకలూఠీ నామసంవత్సరంగా ప్రజలకు దారుణమైన చేదుజ్ఞాపకాలను మిగిల్చిందని, ఈ సంవత్సరం రాష్ట్రం జగన్ అనే వైరస్ తో పీడింపబడిం దని, వ్యవస్థలుసహా, రాష్ట్రంలోని ప్రజలంతా సదరు వైరస్ బారినపడిన వారేనని, ఒక్కఛాన్స్ అని నమ్మి 151 సీట్లు ఇచ్చినపాపానికి ఆంధ్రులంతా బ్రిటీష్ వారిపాలనకంటే, దారుణమైన క్రూరమైన పాలన రుచిచూశారని టీడీపీఎమ్మెల్సీ అశోక్ బాబు వాపోయారు.శుక్రవారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయకార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే క్లుప్తంగా మీకోసం…!

2021 జగన్ పీడకనామ సంవత్సరం- ఆయన సాధించిన ఘనతలు.
జగనోరస్ అనే వైరస్ తో ప్రజలు సర్వనాశనమైన సంవత్సరం.
మితిమీరిన పన్నుల నామసంవత్సరం… భగ్గుమన్నధరలతో ప్రజలబతుకులు బలైన సంవత్సరం.
మోసకారీ సంక్షేమనామ సంవత్సరం… అప్పులనామ సంవత్సరం.
అభివృద్ధిశూన్యనామ సంవత్సరం.. సంక్షేమం సర్వనాశనమైన సంవత్సరం.
అంతులేని అవినీతి రాజ్యమేలిన సంవత్సరం. విధ్వంసక, వికృత, వినాశ నామసంవత్సరం… హత్యలు, అత్యాచారాల నామసంవత్సరం… అమాయకులు లెక్కకు మిక్కిలి బలైనసంవత్సరం. మాటతప్పి,

మడమతిప్పిన మదోన్మత్తుల నామసంవత్సరం.
జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రజలకు 2021 సంవత్సరం పీడక, లూటీ నామ సంవత్సరంగా మిగిలిపోయింది. ఈ ఏడాదిలో ప్రజలకు న్యాయం కంటే అన్యాయమే ఎక్కువగా జరిగింది. అప్పులు ఘనం – అభివృద్ధి శూన్యంగా మారింది. సంక్షేమం మాటున సంక్షోభాన్ని సృష్టించారు. చేసింది గోరంత.. ప్రచారం కొండంతగా మిగిలింది. రంగులు, శాండ్, వైన్, మైన్, పత్రికా ప్రకటనలు, సలహాదారులు, వాలంటీర్లతో ప్రజాధనాన్ని దుబారా, వృధా, లూఠీ చేశారు. ప్రశ్నించిన వారిపై లాఠీలు ఝుళిపించారు. మద్యం, గంజాయి, హెరాయిన్ లకు రాష్ట్రాన్ని అడ్డాగా మార్చారు. అన్ని వ్యవస్థలను సర్వనాశనం చేసిన సంవత్సరంగా 2021 చరిత్రలో నిలిచిపోతుంది.

1.కరోనావేళ అన్నిరాష్ట్రాలు బాధిత కుటుంబాలకు ప్రత్యేక ప్యాకేజీగా సరుకులు నగదు సహాయం చేశాయి. కాని ఏపీలో జగన్ ప్రభుత్వం కేంద్రం పంపిన సహాయమే ఇచ్చింది గాని ఇతర రాష్ట్రాలమాదిరి ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వలేదు. కనీసం కరోనామృతులకు దహనసంస్కారాలు కూడా సక్రమంగా నిర్వహించలేదు.
2.కరోనాతో కుదేలైన కుటుంబాలపై కనికరం లేకుండా జగన్ రెడ్డి ప్రభుత్వం పన్నుల మోత మోగించింది. భారీగా ధరలు పెంచింది. ప్రజల్ని క్రూరంగా పీడించింది.
3.మాస్క్ అడిగిన నేరానికి డాక్టర్ సుధాకర్ ను కొట్టి అవమానపరచి రకరకాలుగా హింసించి ఆయన చావుకు కారణమయ్యారు. హత్యలు, అత్యాచారాలకు వందలాది మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజలు బలయ్యారు.
4. నంద్యాల్లో పోలీసుల వేధింపుల వల్ల అబ్దుల్ సలాం కుటుంబంలోని నలుగురు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు.
5. సీ.ఎం. ఇంటికి కూత వేటు దూరంలో అత్యాచారం జరిగితే నేరస్థుడు వెంకట రెడ్డిని ఇప్పటికీ పట్టుకోలేదు.
6. ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలు, నాయకుల ఆస్తుల్ని విధ్వంసం చేశారు.
7. అక్రమ కేసులు పెట్టి వందలాది మందిని జైళ్లకు పంపారు. మానవ హక్కుల్ని మంటకలిపారు. ఎస్సీలపైనే అట్రాసిటీ కేసులు పెట్టి చట్టాన్ని నీరుగార్చారు.
8. శాసన వ్యవస్థను నామమాత్రం చేశారు – ప్రతిపక్ష పార్టీలు, నాయకుల గొంతు నొక్కారు.
9. న్యాయ స్థానాలపై దుష్ప్రచార దాడి చేశారు. న్యాయమూర్తులను బ్లాక్ మెయిల్ చేశారు.
10. మీడియాపై దాడి చేస్తూ జీవో నెం. 2430 తెచ్చారు. అసెంబ్లీకి మీడియాను అనుమతించకుండా ఆంక్షలు విధించి పత్రికా స్వేచ్ఛను హరించారు.
11. స్థానిక సంస్థల ఎన్నికల్లో దొంగ ఓట్లు, దోపిడీ నోట్లు, పోలీసు, రౌడీ మూకలతో ప్రజాస్వామ్యాన్ని చెరబట్టి ఎన్నికలను ప్రహసనంగా మార్చారు.
12. అభివృద్ధి లేదు. అమరావతిని అంతంచేసి, పోలవరాన్ని దెబ్బతీశారు. రోడ్లనిర్మాణం, గృహ నిర్మాణం లేదు. పరిశ్రమలు, పెట్టుబడులు, ఉద్యోగాలు లేవు.
13. సాగు నీటి ప్రాజెక్టులను పట్టించుకోలేదు – మరమ్మత్తులకు నిధులు కేటాయించకపోవడంతో వరదలకు ప్రాజెక్టులు కొట్టుకుపోయాయి – ఈ ఏడాది ఒక్క ఎకరా సాగుకు అధనంగా నీరందించలేదు. ఒక్క ప్రాజెక్టు ప్రారంభోత్సవం చేయలేదు.
14. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సబ్ ప్లాన్ నిధుల్ని దారి మళ్లించారు – కార్పొరేషన్లకు రూపాయి నిధులు కేటాయించకుండా నిర్వీర్యం – సామాజిక న్యాయం మంటగలిపారు.
15. అమ్మఒడికి రూ. 14 వేలిచ్చి నాన్న బుడ్డి ద్వారా రూ. 50 వేలు లాక్కుంటున్నారు – ఈ ఏడాది అదికూడా ఎగ్గొట్టారు – నాడు నేడు పేరుతో వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారు.
16. బీసీల రిజర్వేషన్లు 10 శాతం తగ్గించి 16,800 పదవులు పోగొట్టి రాజకీయంగా బీసీలప్రాబల్యాన్నిఅడ్డుకున్నారు – ఆధరణ పధకం రద్దు చేశారు.
17. కాపు రిజర్వేషన్లు రద్దుచేశారు. కాపులకు అన్ని విధాలుగా ద్రోహం చేశారు.
18. మద్య నిషేధంపై మడమ తిప్పారు – మద్యం ఆదాయం 15 ఏళ్లపాటు బ్యాంకులకు కుదువ పెట్టారు.
19. ఫీజు రీయింబర్స్ మెంట్ టీడీపీ ప్రభుత్వం 16 లక్షల మందికి ఇస్తే దాన్ని 11 లక్షలకు కుదించారు
20. పీఆర్సీ, సీపీఎస్ పై మడమ త్రిప్పి, ఉద్యోగుల జీవితాల్లో చీకట్లు నింపారు.
21. తెచ్చిన రూ. 3. 64 లక్షల అప్పు జగన్ రెడ్డి గ్యాంగ్ లూఠీకి, దుబారాకు హారతికర్పూరంలా ఆవిరైంది.
22. సెంటు పట్టాలపేరుతో ఇళ్లస్థలాలముసుగులో రూ. 7 వేల కోట్లు లూఠీ చేశారు.
23. మధ్యం రేట్లు పెంచి రూ. 25 వేలకోట్లు లూఠీ చేశారు.
24. ఇసుక రేట్లు పెంచి రూ. 10 వేల కోట్లు లూఠీ చేస్తున్నారు.
25. ఇలా లక్ష కోట్లు లూఠీ చేశారు – జగన్ గ్యాంగ్ కల కలంతో – జనం బ్రతుకులు వెల వెలా – ఇచ్చింది గోరంత – దోపిడీ కొండంత – ప్రచారం చెవులు చిల్లులు పడేంత. ప్రతికుటుంబానికి మిగిలిన అప్పు – రూ.2,50,000.
26. జగన్ రెడ్డి గ్యాంగ్ దోపిడీ, విధ్వంసం నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు కుల, మత, ప్రాంతీయతత్వం రెచ్చగొట్టారు.
27. మైనింగ్, డ్రగ్ మాఫియాలు రాష్ట్రంలో చెలరేగిపోతున్నాయి.
28. విద్యుత్ వ్యవస్ధను చిన్నాభిన్నం చేసి అవినీతి, అప్పులమయం చేశారు – ఆ భారాన్ని ప్రజలపై రుద్దారు.
29. ఆరోగ్య వ్యవస్థను నిర్వీర్యం చేశారు – ఆరోగ్య శ్రీని అథోగతి పాలు చేశారు – సీ.ఎం సహాయ నిధికి పాతరేశారు.
30. విద్యా వ్యవస్ధను కక్ష్యతో , వివక్షతో అధోగతి పాలుచేశారు.

జగన్ రెడ్డి తన పీడక నామ సంవత్సరంలో పోలవరాన్ని రివర్స్ టెండరింగ్ పేరుతో పడుకో బెట్టాడు. మద్యనిషేధం పేరుతో రూ.15వేలకోట్ల వరకు దోపిడీచేశాడు. రాష్ట్రంలోని ఇసుకరీచ్ లన్నింటినీ ఒకేవ్యక్తిపరంచేసి, ఆ వ్యక్తిద్వారా వేలకోట్లసొమ్ముని తనఖజానాకు చేర్చు కుంటున్నాడు. రాష్ట్రంలో 30లక్షలమంది పేదలకు ఇళ్లస్థలాలిస్తామంటూ సెంటుపట్టాల పేరుతో రూ.7వేలకోట్లవరకు దోచేశాడు.

గ్రామస్థాయి వైసీపీనేతల నుంచి ఎమ్మెల్యేల వరకు అందరూ ఇళ్లపట్టాలపేరుతో జరిగిన అవినీతిలో భాగస్వాములయ్యారు. బహుశా భారతదేశంలో ఎక్కడా జరగనంత అవినీతి, సెంటుపట్టాల పథకం ముసుగులో జగన్ ప్రభుత్వంపాల్పడింది. ఈ విధంగా చేసిన అవినీతికితోడు, 108 వాహానాల సేవలు, బియ్యంరవాణా వాహనాలపేరుతో మరోకొత్తరకమైన అవినీతికి కూడా ముఖ్యమంత్రి, వైసీపీ ప్రజాప్రతినిధులు పాల్పడ్డారు.

చివరకు చెత్తసేకరణ వాహనాలను కూడా ఈ ప్రభుత్వం తనఅవినీతి వనరుగా మార్చుకుంది. ఇకపరిపాలన విషయానికివస్తే, అధికారులు, మంత్రులు, కిందిస్థాయి యంత్రాంగం ఎవరికివారేయమునా తీరే అన్నట్లుగాఉంది. రాష్ట్రసచివాలయంలో ఉద్యోగులు పనిచేస్తున్నారా అనే అనుమానం కలుగుతోంది. ముఖ్యమంత్రి తనప్యాలెస్ దాటి బయటకురాడు.. మంత్రులు వారిదోపిడీ, అవినీతి వ్యవహా రాల్లోనే మునిగితేలుతున్నారు తప్ప.. కనీసం వారినియోజకవర్గాల్లోని సమస్యలపరిష్కారం పై కూడా శ్రద్ధపెట్టడంలేదు. రాష్ట్రానికి ఎంతనష్టం జరిగింది… కేంద్రప్రభుత్వం ఇస్తామన్న వాటి పైన, చేస్తామన్నవాటిపైన ఏంచేద్దామనే ఆలోచన ఏనాడూ ముఖ్యమంత్రిచేయలేదు. ఉద్యోగు లకు ఇవ్వాల్సిన పీఆర్సీ,డీఏల చెల్లింపుల ఊసు ఎత్తడంలేదు. సీపీఎస్ రద్దు హామీని పూర్తి గా అటకెక్కించాడు.

ఇప్పుడు ఏపీలోసాగుతున్న అరాచకపాలన గతంలో బీహార్ వంటి రాష్ట్రాల్లో కూడా జరిగిఉండదు. అసెంబ్లీలో ప్రతిపక్షంపై దాడలు.. మండలిలో దూషణలు. రాష్ట్ర విభజన సమయంలో జరిగిననష్టాన్ని భర్తీచేస్తామన్న హామీల్లో ఒక్కదాన్ని కూడా జగన్ రెడ్డి అమలుచేయలేదు. 25మందిఎంపీలున్నాకూడా కేంద్రాన్ని అడుక్కోవడంతప్ప, మరోమార్గం లేదంటున్నాడు. 9, 10 షెడ్యూళ్లఆస్తులను రాబట్టలేక చేతులెత్తేసి, తెలంగాణపరం చేశాడు. రూ.70వేలకోట్లవరకు రాష్ట్రానికి రావాల్సి ఉంటే, 70రూపాయలు కూడా సాధించలేకపోయా డు. మద్యంపై వచ్చేఆదాయాన్ని తాకట్టు పెట్టి రూ.25వేలకోట్ల అప్పులు తెచ్చారు. విద్యుత్ వ్యవస్థలను తనఖాపెట్టి, రూ.24వేలకోట్ల అప్పులు తెచ్చారు. ప్రజలకు తిప్పలు.. రాష్ట్రానికి అప్పులు… జగనోరస్ తో ఏపీకి మిగిలిన గొప్పలు.

Leave a Reply