సచివాలయ ఉద్యోగుల పోరాటాలపై ఆంక్షలు సరికాదు

– ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు నల్లపల్లి విజయ్ భాస్కర్

వెలగపూడి లోని రాష్ట్ర సచివాలయ ప్రాంగణం లో ఉద్యోగులు ర్యాలీలు, నినాదాలు, ధర్నాలు చేయకూడదని ప్రభుత్వం సర్కులర్ జారీచేయడం సరైనది కాదని ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు నల్లపల్లి విజయ్ భాస్కర్ విమర్శించారు.

ఉద్యోగుల తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం శాంతియుతంగా నినాదాలు, ర్యాలీలు చేయడం పోరాటం లో భాగమని అన్నారు. ఒకవైపు ఫ్రెండ్లీ ప్రభుత్వం అని చెప్పుకుంటూ మరోవైపు ఇలా ఉద్యోగుల హక్కులను అణచివేసే రకంగా సర్కులర్ జారీచేయడం ఎంతవరకు సమంజసం అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఉద్యోగుల న్యాయమైన సమస్యలు ప్రభుత్వం పరిష్కారించక పోవడం వల్ల ఉద్యోగులు పోరాటాలు చేస్తున్నారని, తమ సమస్యల కు పరిష్కారం చూపకుండా ప్రభుత్వం అణచివేత ధోరణి అవలంభించడం సరైనది కాదని అన్నారు.

Leave a Reply