-కేంద్ర మంత్రి భారతి పవార్
గుంటూరు నగరంలో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి భారతీ ప్రవీణ్ పవార్ పర్యటించారు. ముందుగా ఆంధ్రాలో ఒకసారి దేశంలో మరోసారి బిజెపి సర్కార్ అనే నినాదాన్నీ గోడమీద రాసారు. జిల్లా అధ్యక్షులు వనమా నరేంద్ర కుమార్ నివాసంలో జరిగిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ…
ఓటర్ల దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ యుతతో ముఖాముఖిలో పాల్గోని, వారు ఓటుహక్కు వినియోగించుకోవాలని జాగృతం చేశారు. ఎయిమ్స్ ను సందర్శించాను. గత సంవత్సరం ఔట్ పేషంట్ నాలుగు లక్షలు. ఈ సంవత్సరం అయిదు లక్షలు రోజు రోజుకీ సేవలు పెంచుతున్నాము. దేశంలోని ఎయిమ్స్ లలో మంగళగిరి అభివృధ్ది పధంలో నడుస్తోంది.
ప్రధానమంత్రి జనారోగ్య యోజన ద్వారా మందులు కూడా అందిస్తున్నాము. విక్సిత్ భారత్ సంకల్పయాత్రను సందర్శించాము. ప్రజలు ఎంతో ఉత్సాహంగా పాల్గోని, స్టాళ్లను సందర్శిస్తున్నారు.
బి.పి, షుగర్ వంటి వ్యాధులకోసం పరీక్షలు చేయించుకుంటున్నారు.
గుంటూరు జిల్లాలో ఇప్పటివరకు 262 గ్రామపంచాయితీలలో
యాత్ర పూర్తయింది.
జిల్లాలో అయిదువేలకన్నా ఎక్కువ ఉజ్వల కనెక్షన్లు ఇచ్చాము. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 70 వేల గృహాలు మంజూరు చేశాము. విశ్వకర్మ యోజన కుకూడా విక్సిత్ భారత్ యాత్రలో దరఖాస్తులు స్వీకరిస్తున్నాము. ఈయాత్ర మారుమూల గ్రామాలలో కూడా వెల్లాలని, 2047 కల్లా విక్సిత్ భారత నిర్మాణానికి ఈయాత్ర ఎంతో ఉపయోగపడుతుంది.
లక్షల కోట్లమంది ఈయాత్రలో భాగస్వాములౌతున్నారు. 12 కోట్లమందికి పైగా ఇప్పటికీ ఈయాత్రలో పాల్గోన్నారు. ఈయాత్ర ఎఁతో విజయవంతం అయింది. ప్రజలు తమ గ్రామాలలో కూడా యాత్ర రావాలని అభిలషిస్తున్నారు.
ప్రధానమంత్రి జనారోగ్య యోజన కార్డుల పంపిణీపై అధికారులు మరింత శ్రధ్దపెట్టేలా చేయాలని నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను. తద్వారా అయిదు లక్షల ఆరోగ్య బీమా ప్రజలకు లభించాలి. తద్వారా మోదీ గ్యారంటీ ప్రజలకు చేరాలి. పేదల సంక్షేమమే ఈ యాత్ర పరమావధి. ఇంకా కోద్ది గ్రామాలు మాత్రమే ఈ యాత్ర చేరాల్సి ఉంది.
సబ్ కాసాధ్ సబ్ కా వికాస్, సబ్ కా ప్రయాస్ అనే మంత్రంతో ప్రధాని పాలన కోనసాగుతోంది. ఈ ప్రయత్నానికి ప్రతి ఓక్కరూ చేయి కలపాలని నేను కోరుతున్నాను. విలేకరులతో సమావేశంలో గుంటూరు జిల్లా బిజెపి అధ్యక్షులు వనమా నరేంద్రకుమార్ బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు చందు సాంబశివరావు, టుబాకో బోర్డు చైర్మన్ యశ్వంత్ కుమార్, రాష్ట్ర ప్రవాస్ యోజన కన్వీనర్ పాకా సత్యనారాయణ, కో-కన్వీనర్ మాగంటి సుధాకర్ యాదవ్, బిజెపి సీనియర్ నాయకులు జూపూడి రంగరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి చరక కుమార్ గౌడ్, సుబ్బారావు, మండల అధ్యక్షుడు కారంసెట్టి రమేష్, పద్మనాభం, నారాయణ, సుధాకర్, రాజేష్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.