Suryaa.co.in

Entertainment Telangana

బాప్ రే..దేవరా?

– ఇబ్రహీంపట్నంలో అర్ధరాత్రి ఒంటిగంటకు దేవరా షో
– టికెట్ ధర సుమారు 800/-
– శుక్రవారం ఉదయం 7.00లకు మరో షో… టికెట్ ధర 450/-
– అంతా బ్లాక్ మార్కెట్టే
– అభిమానుల జేబులకు చిల్లులు పెడుతున్న థియేటర్ల యాజమాన్యాలు
– దోపిడీకి అధికారులు అడ్డుకట్ట వేస్తారా? వత్తాసు పలుకుతారా?
(హఫీజ్ ఖాద్రీ )

దేవర చిత్రం సినిమా శుక్రవారం విడుదల కానుంది. భారీ అంచనాల నడుమ విడుదలవుతున్న ఈ చిత్రం టికెట్ ధరను పెంచేందుకు, అధిక షోలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే బ్లాక్ మార్కెట్ చేసి, అభిమానుల జేబులకు చిల్లులు పెట్టేందుకు, ఇబ్రహీంపట్నం థియేటర్ల యాజమాన్యాలు ప్రయత్నిస్తున్నాయి.

హద్దు అదుపు లేకుండా అర్ధరాత్రి షోలకు ప్రయత్నాలు చేస్తున్నారు. అర్ధరాత్రి ఒంటి గంటకు షోకు టికెట్ ధర రూ.800 అంటే ఆశ్చర్యం కలగక మానదు. ఉదయం ఏడు గంటలకు మరో షోకు రూ.450 టికెట్ ధర పలుకుతోంది.

టికెట్ థియేటర్ వద్ద దొరుకుతుందా అంటే దొరకదు.. ప్రైవేట్ వ్యక్తులకు టికెట్లు అప్పజెప్పి బ్లాక్ మార్కెట్ లో టికెట్లను విక్రయిస్తూ జేబులు నింపుకోవడానికి రంగంలోకి దిగారు. ప్రభుత్వం టికెట్ రేటును పెంచడంతో ఇబ్రహీంపట్నంలో టికెట్ ధర రూ.150-200 మాత్రమే ఉండాలి.. కానీ 500/800 అంటే ఏ స్థాయిలో దోపిడీ ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఇదంతా అధికార యంత్రాంగానికి తెలిసి జరుగుతుందా? తెలియక జరుగుతుందో… తెలియక ప్రజలు సతమతమవుతున్నారు. ఇప్పుడు ఎలాగో బహిర్గతమైంది అడ్డుకుంటారా? వత్తాసు పలికి నడుపుతారా? అధికారుల చేతుల్లోనే ఉంది.

LEAVE A RESPONSE