తిరుపతి: పార్లమెంటు ఉప ఎన్నికల సందర్భంగా నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఐదుగురు అధికారులపై వేటు పడింది. ఈ మేరకు డీజీపీ ద్వారక తిరుమల రావు ఉత్తర్వులు జారీ చేశారు.
తిరుపతి ఈస్ట్ సీఐ మహేశ్వర్‌రెడ్డిని వీఆర్‌కు పంపి, ఆయన స్థానంలో ట్రాఫిక్ సీఐ శ్రీనివాస్‌కు తాత్కాలిక బాధ్యతలు అప్పగించారు. కాగా సీఐ మహేశ్వర్‌రెడ్డి నిన్న రాత్రి నుంచి ఫోన్ స్విచాఫ్ చేసుకుని అజ్ఞాతంలోకి వెళ్ళారు. ఆయన బెంగుళూరుకు వెళ్ళినట్టు అధికారులు గుర్తించారు.
నటి, మోడల్ కాదంబరీ జత్వానీ కేసులో ప్రమేయం ఉన్నట్లు తేలడంతో, ఇప్పటికే ముగ్గురు సీనియర్ ఐపీఎస్‌లను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. తాజాగా ఎన్నికల హింసకు సంబంధించి డీజీపీ ఐదుగురు అధికారులపై డీజీపీ వేటు వేయడం పోలీస్ వర్గాల్లో కలకలం రేపింది.