రిజర్వుబ్యాంకు ఆఫ్ ఇండియా ఏర్పడి నేటికి 87 సవంత్సరాలు అయిన సందర్బంగా 88 వ వార్షికోత్సవ శుభాకాంక్షలు
రిజర్వుబ్యాంకు ఆఫ్ ఇండియాలో బాబాసాహెబ్ అంబేడ్కర్ గారి పాత్ర ఏంటనే అసలు విషయమును పరిశీలిద్దాము
మొదట రూపాయి అనే పేరు పెట్టింది షేర్ష (1540-45) అనే ముస్లిం చక్రవర్తి.డాక్టర్ అంబేద్కర్ 1915 లో “Ancient Indian Commerce” అనే సిద్దాంత గ్రంధాన్ని,1916 లో “National dividend of india – A historic and Analytical study” అనే పుస్తకం రాయటం ద్వారా Ph.D. పొందారు.1920 లో లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ ద్వారా D.Sc., పొందారు. 1923 లో “The problem of Rupee; its origin” ane పుస్తకం రాశారు.డాక్టర్ అంబేద్కర్ చేసిన ప్రతిపాదనల వల్లే Reserve Bank of India 1935 లో ఏర్పడింది. అందుకు ఖచ్చితంగా కరెన్సీ మీద అంబేద్కర్ చిత్రపటాన్ని వెయ్యాలి. అలా చెయ్యకపోవటం ఒక కుట్ర.
“The problem of rupee – origin and solutions”* అనే గ్రంథం అధారంగా….. ఆర్. బి.ఐ. ని స్థాపించడానికి బ్రిటీషు ప్రభుత్వం ఏర్పాటు చేసిన హిల్పన్యగ్ కమీషన్ మందు ఆర్.బి.ఐ. విధి, విధానాలు, పనితీరు, అడ్మినిస్ర్టేషన్ అన్నీ రూపొందించి డా.అంబేడ్కర్ ప్రవేశపెడితే కమీషన్లోని సభ్యులందరు దాన్ని ఏకాభిప్రాయంతో ఆమోదించారు.
ఇది “Royal Commission on Indian currency & Finance గా ఆమెదించబడి బయటకు వచ్చింది. 1934 ఆర్.బి.ఐ బిల్లును శాసనసభ లో ప్రవేశపెట్టే సమయంలో కమిషన్ లోని సభ్యుల ప్రతి ఒక్కరి చేతిలో అంబేడ్కర్ రాసిన “The problem of rupee -Its origin and solution” గ్రంథం దర్శనిమిచ్చిందంటే దీని రూపకల్పన లో డా. అంబేడ్కర్ పాత్ర ఎంతుందో అర్దం చేసుకోవచ్చు.
“The problem of rupee” అనే అంబేడ్కర్ తీసిస్ ఆధారంగా బ్రిటిష్ ప్రభుత్వం 1935 Reserve bank of india ని రిజర్వు బ్యాంకు అఫ్ యునైటెడ్ స్టేట్స్ అఫ్ అమెరికా మోడల్ లో పెట్టాలని ఆలోచన చేసింది.. ఆ సమావేశానికి అక్కడ ప్రతినిధులు కూడా వచ్చినప్పుడు అందరూ అయన థీసిస్ ని చేత్తో పట్టుకు సభకు హాజరు అయ్యారు.దక్షిణ ఆసియాలోనే మొట్ట మొదట అర్ధ శాస్త్రంలో Ph.D. చేసిన మేధావి బాబాసాహెబ్ Dr బి.ఆర్.అంబేడ్కర్.
భారతదేశంలో Reserve bank of India స్థాపనకి కారణమైన వ్యక్తి, ఉన్నత విద్యావంతుడు,దార్శనికుడు,మేధావి ,ఆధునిక భారత పితామహుడు బాబా సాహెబ్ Dr.బి.ఆర్.అంబేడ్కర్. ది ప్రాబ్లేమ్ ఆఫ్ రూపీ ఇట్స్ ఆరిజన్ అండ్ సోల్యూషన్ పై,1926లో,ఫాధర్ ఆఫ్, మోడ్రన్ ఎకనామిక్స్, J.M.keynes- ‘Tha Journel of the Royal Economics society’ లో volume- XXXIV లో 5 పేజీల review వచ్చింది.
మెట్రికులేషన్ నాలుగు సార్లు తప్పిన గాంధీ దేశ ఆర్థిక వ్యవస్థకు చెందిన కరెన్సీ నోట్ల మీద ముద్రించ బడటానికి ఎలా అర్హుడు అయ్యాడు.ఒక గొప్ప వ్యక్తిని విస్మరించటం మన వ్యవస్థ లోపం కాదా. కుట్రలను మనం గ్రహించాల్సిన అవసరం ఉంది. లేకుంటే మన తప్పిదాలకి భారీ మూల్యాన్ని చెల్లించు కోవాల్సిన పరిస్థితి దాపురిస్తుంది. ఇప్పుడు చెప్పండి కరెన్సీ నోట్ల మీద ఫోటో ముద్రించ బడటానికి ఎవరు నిజమైన అర్హులు?
– రవి గ్యాదరి