Suryaa.co.in

Andhra Pradesh

బాబు అంటే బ్రాండ్ హైదరాబాద్ లో చేసి చూపించాం

– ధర్మవరం అసెంబ్లీ నియోజకవర్గం సంజీవపురంలో యువనేత నారా లోకేష్ ని కలిసిన ఇతర రాష్ట్రాల్లో పనిచేస్తున్న సాఫ్ట్ వేర్ ఉద్యోగులు

• అనంతపురానికి టిడిపి హయాంలో ఆటోమొబైల్ పరిశ్రమలు, టెక్స్ టైల్స్ పరిశ్రమలు తీసుకొచ్చి ఎంతో మందికి ఉద్యోగాలు కల్పించారు.
• అదే విధంగా ఐటి కంపెనీలు కూడా అనంతపురానికి తీసుకురావాలని కోరుకుంటున్నాం.
• మన రాష్ట్రంలో ఐటి పరిశ్రమలు లేక కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ వెళ్లి ఉద్యోగాలు చేసుకుంటున్నాం.
• ఉమ్మడి అనంతపురం జిల్లాలో టాలెంట్ ఉన్న యువత ఉన్నారు.
• పైగా ఐటి సంస్థల ఏర్పాటుకు కావాల్సిన అన్ని మౌలిక వసతులు అందుబాటులో ఉన్నాయి.
యువనేత లోకేష్ మాట్లాడుతూ….
• టిడిపి హయాంలో ఐటి కంపెనీలు రాష్ట్రానికి తీసుకురావడానికి ఎంతో కష్టపడ్డాం.
• తమిళనాడు, తెలంగాణ, కర్ణాటకను కాదని మీ రాష్ట్రానికి ఎందుకు రావాలి అని అడిగే వారు.
• వాళ్ళకి నేను ఒకటే చెప్పేవాడిని, మీ కంపెనీల్లో పనిచేస్తున్న ఎక్కువ శాతం మంది ఏపి వాళ్ళే ఉన్నారు కాబట్టి, మా రాష్ట్రంలో సెంటర్ ఏర్పాటు చెయ్యాలని అడిగేవాడిని.
• కంపెనీ ఏర్పాటుకు కావాల్సిన అనుమతులు, రాయితీలు అన్ని వేగంగా ఇవ్వడం వల్లే హెచ్ సిఎల్, జొహో, కాండ్యుయెంట్, పై డేటా సెంటర్ లాంటి పెద్ద కంపెనీలు వచ్చాయి.
• టిడిపి హయాంలో భౌగోళికంగా ఉన్న ప్రయోజనాల దృష్ట్యా ఒక్కో జిల్లాకి సంబంధిత పరిశ్రమలు తీసుకొచ్చాం.
• రాయలసీమ ను ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్ హబ్ గా ప్రమోట్ చేసాం.
• ఉత్తరాంధ్ర లో ఎక్కువగా ఐటి కంపెనీలను ప్రోత్సహించాం.
• టిడిపి గెలిచిన మొదటి వంద రోజుల్లోనే పెద్ద ఎత్తున కంపెనీలు రాష్ట్రానికి రాబోతున్నాయి.
• ఇతర రాష్ట్రాలకు వెళ్లి ఉద్యోగాలు చేసుకోవాల్సిన అవసరం లేకుండా అన్నిరకాల పరిశ్రమలను పెద్ద ఎత్తున రాష్ట్రానికి తీసుకొస్తాం.
• బాబు అంటే బ్రాండ్ హైదరాబాద్ లో చేసి చూపించాం. ఐటిలో ఎపిని ఇతర రాష్ట్రాలకు దీటుగా నిలబెడతాం.

LEAVE A RESPONSE