Suryaa.co.in

Andhra Pradesh

ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టడంలో బాబు సిద్ధహస్తుడు

-ఎమ్మెల్సీ ఎన్నిక కౌంటింగ్ అనంతరం అసెంబ్లీ మీడియా పాయింట్లో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి కురసాల కన్నబాబు

ఇది మా ఓటమి గానీ , టీడీపీ గెలుపుగానీ కాదు… ఎన్నిక జరిగిన 7 ఎమ్మెల్సీ స్థానాల్లో వైఎస్సార్సీపీ 6 స్థానాల్లో గెలిచింది… ఒకటి టీడీపీకి వచ్చింది. చంద్రబాబు ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టడంలో సిద్ధహస్తుడు.మాకున్న సంఖ్య ప్రకారం మేము ఆరూ గెలిచాం… వాళ్లకి 23 స్థానాలు ఉన్నాయి…
కొంత మంది మాతో ప్రయాణం చేస్తున్నారు కాబట్టి మేం పోటీ పెట్టాము. ఇవన్నీ చంద్రబాబునాయుడు టక్కు టమారా విద్యలు. ఏం జరిగింది…ఎలా జరిగింది అనేది మేం విశ్లేషించుకుంటాం – మేం ప్రాక్టీస్ చేశాం తప్ప ఎమ్మెల్యేలను పోచింగ్ చేయలేదు.. అలాంటివి చంద్రబాబే చేశాడు.

చంద్రబాబుకు ఓట్లు కొనడం ఇవాళేమీ కొత్త కాదు. ఆయన హైదరాబాద్ నుంచి ఎందుకు పారిపోయి వచ్చాడు…?మన వాళ్లు బ్రీఫ్డ్ మీ.. అంటూ చంద్రబాబు అక్కడ ఓటుకు రూ.5 కోట్లు ఇవ్వాలని చూసి పట్టుబడి పారిపోయి వచ్చాడు.మా పార్టీ నుంచి ఎవరు ఓట్లు వేశారో విశ్లేషించుకుంటాం.పలా నా వాళ్లు అని తేలితే చర్యలు తీసుకోకుండా ఎలా ఉంటాం. పార్టీని ధిక్కరించి ప్రతిపక్ష పార్టీకి ఓట్లు వేస్తే.. అది తెలిస్తే ఊరుకుంటారా.. ? విశ్లేషించుకుంటాం .. మా నాయకుడు ఆలోచిస్తారు…ఏం చేయాలో నిర్ణయం తీసుకుంటారు.

LEAVE A RESPONSE