Suryaa.co.in

Andhra Pradesh

క్రాస్‌ ఓటింగ్ కు పాల్పడిన వారిపై.. సరైన సమయంలో సరైన నిర్ణయం

– జరిగిన దానికి మేం కాదు…చంద్రబాబే సంజాయిషీ ఇవ్వాలి
– చంద్రబాబునాయుడు ఏ ధీమాతో పోటీ పెట్టారో సమాధానం చెప్పాలి
– వారికి లేని నంబర్‌ 23 ఎలా వచ్చింది..?
– చంద్రబాబు చరిత్ర మొత్తం ప్రలోభాలే..ప్రలోభాల్లో చంద్రబాబు ప్రపంచ ఛాంపియన్‌
– ఆ విషయంలో జగన్మోహన్‌రెడ్డి , మా పార్టీ ఆయనతో పోటీ పడలేం
– ప్రజల విషయంలో జగన్‌ ని దాటుకుని చంద్రబాబు వెళ్లలేడు
– బాబుకు ఒకటే ప్రశ్న…175 స్థానాలలో ఎందుకు పోటీ చేయలేకున్నావ్‌..?
ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై ప్రభుత్వ సలహాదారు (ప్రజావ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి

అసెంబ్లీ ప్రాంగణంలో తనను కలిసిన మీడియాతో ప్రభుత్వ సలహాదారు (ప్రజావ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి ఇంకా ఏం మాట్లాడారంటే:
– జగన్మోహన్‌ రెడ్డి విధానాలు నచ్చి మాకు మద్దతు పలికిన.. టీడీపీ, జనసేన వారిని కలుపుకుని పోటీ పెట్టాం.
– టీడీపీ నుంచి నలుగురు శాసనసభ్యులు, జనసేన నుంచి ఒకరు మొదటి నుంచీ ఇండిపెండెంట్‌గా ఉన్నారు.
– దాంతో మాకు కావాల్సిన 22 మంది సభ్యులు కరెక్ట్‌ గా ఉన్నారు కాబట్టి మాకే 7 సీట్లు రావాలి..అందుకే పోటీ పెట్టాం
– చంద్రబాబునాయుడు ఏ దీమాతో అభ్యర్థిని పెట్టారో ఆయనే సమాధానం చెప్పాలి.
– నెల్లూరు రూరల్, వెంకటగిరి శాసనసభ్యులను లెక్కలోకి వేసుకోకపోయినా మాకు ఒక్కొక్క అభ్యర్థికి 22 మంది బలం ఉంది.
– లెక్క ప్రకారం మాకు మొత్తం 7 స్థానాలు రావాలి.
– అలా రాకుండా పోయాయి అంటే చంద్రబాబునాయుడు ప్రలోభాలకు దిగారని అర్థం చేసుకోవాలి
– వారం రోజులుగా ఆయన చేస్తున్న ప్రయత్నాలు చూస్తున్నాం
– ప్రలోభపెట్టడం అంటే ఇక డబ్బులు తప్ప ఏమీ లేదు..కొనుగోలు చేశారు
– ఎప్పుడూ జగన్మోహన్‌రెడ్డి అలాంటి చర్యలకు వెళ్లలేదు…
– చంద్రబాబు చరిత్ర మొత్తం చూస్తే ప్రలోభాలే కన్పిస్తాయి
– దాంట్లో చంద్రబాబు ప్రపంచ ఛాంపియన్, నేషనల్‌ ఛాంపియన్‌ అన్నా మాకేం అభ్యంతరం లేదు
– ఆ విషయంలో జగన్మోహన్‌రెడ్డి , మా పార్టీ ఆయనతో పోటీ పడలేం..
– ప్రజలకు సంబంధించినంత వరకు ఎప్పుడైనా జగన్‌ గారిని దాటుకుని ఆయన వెళ్లలేడు

జరిగిన దానికి మేం కాదు…చంద్రబాబే సంజాయిషీ ఇవ్వాలి:
– పోటీలో దిగాం కాబట్టి మేం ప్రయత్నం చేశాం..అందర్నీ పిలిచి మాట్లాడాం..మావైపు నుంచి చేయాల్సిన ప్రయత్నాలు అన్నీ చేశాం
– అక్కడ డబ్బు పనిచేసినప్పుడు.. దాని మీద మేం సంజాయిషీ ఇవ్వాల్సిన అవసరం లేదు…చంద్రబాబే సంజాయిషీ ఇవ్వాలి
– ముందు తెలియదు కానీ…మీడియాలో వచ్చిన దాన్ని బట్టి ఎవరైనా అసంతృప్తిగా ఉన్నారని తెలిస్తే వారితో మాట్లాడాం
– చంద్రబాబు ఏమైనా 175 స్థానాల్లో గెలవగలం అనే నమ్మకాన్ని కల్పించాడా..? ఏ నమ్మకంతో వారు అటువైపు వెళ్లారంటే, అందుకు బలమైన కారణం డబ్బే
– శుభం…చంద్రబాబునాయుడు శాశ్వతంగా 23 స్థానాలు రావని ఆయనే ఒప్పుకుంటున్నాడు
– 23 వారికి అచ్చొచ్చిన ఫిగర్‌ అయితే ఆయన్ని కంగ్రాట్స్‌ చేస్తున్నాం
– అన్ని వర్గాల ప్రజలు జగన్‌ చేపట్టిన సంస్కరణలు అందుకుంటున్నారు.
– కాబట్టి మేం చాలా నమ్మకంతో ఉన్నాం…175కు 175 గెలుస్తాం..దానికి దీనికి అసలు సంబంధం లేదు

బాబుకి ఒకటే ప్రశ్న…175 స్థానాలకి ఎందుకు పోటీ చేయలేకున్నావ్‌..?
– చంద్రబాబుకు నాది ఒకటే ప్రశ్న…175 స్థానాలకి ఎందుకు పోటీ చేయలేకున్నావ్‌..?
– నిజంగా చంద్రబాబు దీన్ని చూసి బలపడ్డామనుకుంటే 175కు ఎందుకు పోటీ చేయలేకున్నాడు..?
– ఏ పార్టీ అయినా.. వారి విధానాలు, వారి మేనిఫెస్టోలో ఇది చెప్పాం.. ఇది చేశాం అని వెళ్లడం కరెక్టా..? లేక పదిమందిని కలుపుకుని అధికారం కోసం, అడ్డదారులు తొక్కి ఓట్లు వేయమనడం కరెక్టా..?
– తెలుగుదేశం పార్టీ 175 స్థానాలకు పోటీ చేస్తాం అంటే… అలాంటి నమ్మకాన్ని ఈ గెలుపు ఆయనకు ఇస్తే సంతోషం
– గ్రాడ్యుయేట్‌ ఎన్నికల్లో వారికి వచ్చిన సీట్లను చూసి జగన్‌ ఇంకా ఎందుకు అధికారంలో ఉన్నారన్నట్లు మాట్లాడుతున్నారు
– చివరికి వారి ప్రమాణ స్వీకారానికి జగన్‌ ని పిలవాలి అనేంత వరకూ పగటి కలలు కంటున్నారు
– ఇప్పుడు ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టి తీసుకోవడం మరీ అన్యాయం
– వారికి లేని నంబర్‌ 23 ఎలా వచ్చాయి..?
– నలుగురు మీతో లేరు…పొద్దున లేచినప్పటి నుంచీ నిన్ను తిడుతూనే ఉన్నారు…జగన్‌ తో ఉన్నామని చెప్తున్నారు
– అలాంటప్పుడు 19మంది ఉన్న నీకు 23 ఓట్లు ఎలా వచ్చాయి..? కచ్చితంగా ప్రలోభపెట్టాడు
– అప్పుడు 23 మందిని కూడా అలానే తీసుకున్నాడు …బాబుకు తెలిసిన రాజకీయం అది
– ఆ విద్యలో బాబుతో పోటీ పడటం లేం అని మేం మళ్లీ చెప్తున్నాం..

ఎవరో గుర్తించాం..సరైన సమయంలో సరైన నిర్ణయం:
– ఇది రాజకీయ పార్టీ…ఉద్యోగం కాదు పీకేయడానికి..విప్‌ చెల్లదు..ఉంటే బాగుండేది
– మేం వాళ్లని గమనించినా.. అది ఇంటర్నల్‌ విషయం..సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటాం
– బలం లేకుండా బరిలో దిగిన వారు ప్రలోభాలు పెట్టి ఉంటారా..? మా బలం మాకుండీ..అందులోనూ ఇద్దర్ని లెక్కలోకి వేసుకోకపోయినా మాకు బలం ఉంటే మేం ప్రలోభపెడతామా..?
– జగన్‌ చరిత్ర చూస్తే ఆ రోజు 23 మంది వెళ్తున్నప్పుడు కూడా శుభం.. వెళ్లమనే చెప్పారు..
– ఈ రోజు కూడా అదే అంటాం.. ఉన్నవాళ్లకి గౌరవం ఉంటుంది…కుటుంబంలా చూసుకుంటాం
– వారి వారి ఆశలతో ప్రలోభాలకు గురైతే అది వారిష్టం..ఇది ప్రజాస్వామ్యం
– అసంతృప్తి అనేది ఏముంది..? ఇది పొలిటికల్‌ పార్టీ.
– ఇష్టమైన వాళ్లు జగన్‌తో ఉంటారు…ఆయన విధానాలు నచ్చిన వారు ఉంటారు
– కొంత మంది ఏదో ఆశించి ఏదో రావాలి అనుకుని రాలేదని పక్కచూపులు చూస్తుండవచ్చు
– మాకు ఇక్కడ స్థానం లేదనుకుని, టీడీపీలో మాదిరిగా దోచుకోవడానికి, దాచుకోవడానికి అవకాశం లేదనుకున్న వారు వెళ్తారు
– తగిన చర్యలు తగిన రకంగా… తగిన సమయంలో ఉంటాయి
– ప్రత్యేకంగా మీకు లంచం ఇస్తాం ఉండండి అని చెప్పే వ్యక్తి జగన్‌ కాదు కాబట్టి ఆయన ఆ పని చేయరు
– మాట్లాడిన వారిలో చాలా మంది ఉన్నారు…వారిలో అందర్నీ అనుమానిస్తామనడం సరికాదు
– మేం గుర్తించడం కోసం ఒక మెకానిజం పెట్టుకున్నాం..ఎవరెవరు క్రాస్‌ ఓటింగ్‌ వేశారు అనేది తెలిసింది
– తెలిసిన తర్వాత సరైన సమయంలో..సరైన నిర్ణయం ఉంటుంది.

LEAVE A RESPONSE