Suryaa.co.in

Andhra Pradesh

బాబు, పవన్, పురందేశ్వరి ఫోన్లు ట్యాపింగ్

– ఈసీ అధికారుల ఫోన్లకే దిక్కులేదు
– ఎస్పీ నిషాంత్‌రెడ్డి, కొల్లి రఘురామిరెడ్డి, నరేందర్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి, వేణుగోపాల్‌రెడ్డికి రెడ్డికులపిచ్చి
– ఫోన్ ట్యాపింగ్ వెనుక అడిషనల్ ఎస్పీ నరేందర్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి, వేణుగోపాల్‌రెడ్డి
– కొంతమంది ఐపీఎస్ అధికారులు వైసీపీ వలంటీర్లుగా పనిచేస్తున్నారు
– ఎన్నికల సంఘం అధికారుల ఫోన్లను ట్యాప్ చేయడమే పని
-టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు

కొంత మంది ఐపీఎస్ అధికారులు తాడేపల్లి ప్యాలెస్ ఆదేశాలు పాటిస్తూ వైసీపీ వలంటీరుల్లా వ్యవహరిస్తున్నారని.. గతంలో అనేక ఘటనల్లో వీరు పక్కాగా దొరికిపోయినా తాడేపల్లి ప్యాలెస్ ఆశీస్సులు ఉండటంతో వీరిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యలు బోండా ఉమామహేశ్వరరావు ధ్వజమెత్తారు. రాష్ట్రంలోని పోలీసు అధికారుల ఏకపక్ష ధోరణిపై మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు.

కొద్దిమంది పోలీసు అధికారులకు జగన్ రెడ్డి ఆశీస్సులు ఉండటంతో బరితెగించి ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. ‘చిలకలూరిపేటలో మోదీ పాల్గొన్న కూటమి సభను భగ్రం చేయడానికి ఐపీఎస్ అధికారులే కుట్ర పన్నారు. దీనిపై ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘాలకు పిర్యాదు చేశాం. ఎన్నికల సంఘం స్పందించాల్సిన అవసరం ఉంది. మైక్ దగ్గరకు వచ్చి ప్రధాని వచ్చి అలర్ట్ చేసే వరకు పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారంటే జగన్ రెడ్డి ఎంత బలంగా పల్నాడు ఎస్పీకి ఆదేశాలు ఇచ్చి ఉంటాడో అర్ధం చేసుకోవచ్చు.

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఏ రాజకీయ పార్టీయైన తమ పార్టీ నాయకులను ఎన్నికల కార్యకలాపాలకు వాడుకుంటారు. కానీ, వైసీపీ మాత్రం వినూత్నంగా వైసీపీ నాయకులు చేయాల్సిన పనులను ఐపీఎస్‌ అధికారుల చేత చేయిస్తున్నారు. పోలీసులు ఎంత దిగజాయిపోయి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారో చిలకలూరి పేట సభతో అర్ధమైపోయింది. జగన్ రెడ్డి మరో 45 రోజుల్లో రాష్ట్రం విడిచి పారిపోబోతున్నాడని పోలీసు అధికారులు అర్ధం చేసుకోవాలి. పోలీసులు ఇప్పటికే తప్పులపై తప్పులు చేశారు. ఇకనైనా వారు మారకపోతే వారి ఉద్యోగాలకే ప్రమాదం.

ఎన్నికల్లో మద్యం, మనీలను నేరుగా ఓటర్లకు పంపిణీ చేసే బాధ్యత చిత్తూరు జిల్లా ఎస్పీ రిషాంత్ రెడ్డి తీసుకున్నారు. రిషాంత్ రెడ్డి పెద్దిరెడ్డి బంధువు. ఈయన పుంగనూరులో తెలుగుదేశం వారిపై అనేక అక్రమ కేసులు పెట్టారు. తాడేపల్లి ప్యాలెస్ ఆదేశాలను పాటిస్తూ.. పెద్దిరెడ్డి ఇంట్లో పాలేరులా పనిచేస్తున్నాడు. ఇటీవల వచ్చిన ట్రాన్స్‌పోర్టర్ సినిమాలోని ఓ క్యారెక్టర్‌ను రిషాంత్ రెడ్డి పోషిస్తూ.. అన్ని నియోజకవర్గాలకు మనీ, మద్యం సరఫరా చేసే బాధ్యతలను తీసుకున్నాడు.

విజిలెన్స్ అండ్ ఎన్స్ ఫోర్స్ ‌మెంట్‌లో ఇన్సెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గా పనిచేస్తున్న కొల్లి రఘురాం రెడ్డి ప్రతిపక్ష నాయకులపై అక్రమ కేసులు పెట్టడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. ఇటీవల నారాయణ, ప్రతిపాటి పుల్లారావు లపై అక్రమ కేసులు బనాయించాడు. తెదేపా అధినేత చంద్రబాబు నాయుడిని అర్ధరాత్రి ఒంటిగంటకు అక్రమంగా అరెస్టు చేసిన ఘనుడు ఈ కొల్లి రఘురాం రెడ్డే. ఇతనికి ఉన్న అధికారాలు చాలక చట్టాన్ని మార్చి అపరిమిత అధికారాలు ఇవ్వాలని కోరిన వ్యక్తి ఇతను. తెలుగుదేశం, జనసేన నాయకులను వేధించడమే ఈయన ప్రధాన లక్ష్యం. ప్రతిపాటి పుల్లారావు కుమారుడు శరత్‌పై అక్రమంగా కేసు పెట్టి జైలుకు పంపించాడు. నెల్లూరులో మాజీ మంత్రి నారాయణ ఇంటిపై అర్ధరాత్రుళ్లు పది సార్లుకు పైగా దాడులు చేశాడు.

కొల్లి రఘురాం రెడ్డి, రిషాంత్ రెడ్డిలు జాతీయ ఛానెళ్లలో ఎన్నికలపై వస్తున్న సర్వే నివేదికలు చూస్తున్నట్లు లేరు. ఐప్యాక్ ప్రశాంత్ కిశోర్ వైసీపీ ఘోరంగా ఓడిపోతుందని చెప్పారు. అయినా, వీరు జగన్ రెడ్డి, సజ్జల రామకృష్ణ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, విజయసాయి రెడ్డి, వై.వీ సుబ్బారెడ్డి ల ఆదేశాలు పాటిస్తూ బరితెగించి వైసీపీ పార్టీకి వలంటీర్లులా పనిచేస్తున్నారు. అడిషనల్ ఎస్పీలైన నరేందర్ రెడ్డి, రవీందర్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి లు ప్రతిపక్ష నాయకులు, ఎన్నికల సంఘం అధికారుల ఫోన్లను ట్యాప్ చేయడమే పనిగా పెట్టుకున్నారు.

ఇటీవల తెలంగాణలో ప్రతిపక్ష పార్టీ నాయకుల ఫోన్లు ట్యాప్ చేసి ప్రణీత్ అనే పోలీసు అధికారి అరెస్టు అయ్యి జైల్లో చిప్పకూడు తింటున్నాడు. తెలంగాణలో కేసీఆర్, ఆంధ్రప్రదేశ్‌లో జగన్ రెడ్డి పెగాసస్ అనే సాప్ట్‌వేర్‌ను కొనుగోలు చేసి ప్రతిపక్ష పార్టీ నాయకుల ఫోన్లు ట్యాపింగ్ చేయించారు. ఈ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్‌లు జరుగుతున్నాయని సాక్షాత్తు 11.05.2022 న మంత్రి పెద్దిరెడ్డి, 23.03.2022 న గుడివాడ అమర్నాద్ లు పేపర్ స్టేట్‌మెంట్ ఇచ్చారు. మంత్రి పెద్దిరెడ్డి, గుడివాడ అమర్నాద్ లు ఇచ్చిన స్టేట్మెంట్ల కంటే ఇంకా ఆధారాలు ఏం కావాలి?

చట్టాన్ని కాపాడాల్సిన ప్రభుత్వ పెద్దలు డబ్బు, మద్యం, దౌర్జన్యాలు, అక్రమ కేసులు బనాయించి ఏదో విధంగా ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారు. వై నాట్ 175 అనే వైసీపీ నినాదం వెనక దాగి ఉన్న అర్ధం ఇదేనా జగన్ రెడ్డి? ఎన్నికల సంఘం అధికారుల ఫోన్లే ట్యాప్ చేస్తున్నారంటే ఈ రాష్ట్రంలో సామాన్యుడికి రక్షణ ఉందా? ఎన్నికల అధికారులతో సహా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, పురందేశ్వరీ ఫోన్లు, ప్రతిపక్ష నాయకుల పోన్లు ట్యాప్ చేస్తున్నారంటే ఈ రాష్ట్రం ఎటుపోతోంది.

వైసీపీ వలంటీర్లులా వ్యవహరిస్తున్న పోలీసు అధికారులపై కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘానికి కూటమి సభ్యులు స్వయంగా పిర్యాదు చేస్తాం. పశ్చిమ బెంగాల్‌లో రాజీవ్ కుమార్ అనే డీజీపీని తొలగించి ఆ స్థానంలో సంజీవ్ ముఖర్జీని ఎలక్షన్ కమీషన్ ఆఫ్ ఇండియా నియమించిందో అందరం చూశాం. అయినా తాడేపల్లి తాబేదార్ పోలీసు అధికారులకు కనువిప్పు కలగడం లేదు. రిషాంత్ రెడ్డి, కొల్లి రఘురాం రెడ్డి, నరేందర్ రెడ్డి, రవీందర్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి లు కుల పిచ్చి, పార్టీ పిచ్చి, ప్రమోషన్ల పిచ్చితో పనిచేస్తున్నారు.

ఆల్ ఇండియా సర్వీసెస్‌లో ఉద్యోగం పొంది, రాజ్యాంగాన్ని, చట్టాన్ని అమలు చేస్తామని ప్రమాణం చేసిన వీరు వాటిని వదిలేసి వైసీపీ పార్టీ తీర్మానాలను అమలు చేస్తూ..రాష్ట్రాన్ని భష్టుపట్టిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘం వీరిపై విచారణ చేసి వెంటనే వీరిపై అనర్హత వేటు వేసి విధుల నుంచి తప్పించాలి. అవసరైన పక్షంలో ఇతర రాష్ట్రాల ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను రాష్ట్రానికి తీసుకొచ్చి ప్రజాస్వమ్యబద్దంగా ఎన్నికలు జరిపించాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘంపై ఉంది.

అధికారులు తాడేపల్లి ప్యాలెస్ ఉచ్చులో పడొద్దు. ఎన్నో సంవత్సరాల సర్వీసు రికార్డులను పాడు చేసుకోవద్దు. 40 రోజుల తర్వాత జే-గ్యాంగ్ రాష్ట్ర విడిచి పారిపోబోతోంది. పోలీసు అధికారులు వైసీపీ నాయకుల ప్రభావానికి గురై తమ పరిధికి మించి పనిచేస్తే దెబ్బతింటారని హెచ్చరిస్తున్నాం

LEAVE A RESPONSE