– తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షులు బాబు రాజేంద్రప్రసాద్
ఉయ్యూరు లోని మాజీ ఎమ్మెల్సీ బాబు రాజేంద్రప్రసాద్ గారి కార్యాలయంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు “కళ్ళు తెరిపిద్దాం” అనే కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా మాజీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బాబు రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ…. జగన్మోహన్ రెడ్డి అక్రమ కేసులపై నారా చంద్రబాబు నాయుడు ని అరెస్ట్ చేయించి 50 రోజులు పూర్తయిందని, మా నాయకుడు ఏ తప్పు చేయకపోయినా కేవలం రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ఈ సైకో జగన్ చంద్రబాబు నాయుడు గారిపై ఇలాంటి అక్రమ కేసులు పెట్టించాడని, ఎప్పటికైనా చెడుపై మంచి విజయం సాధిస్తుందని, త్వరలోనే నారా చంద్రబాబు నాయుడు విడుదలై కడిగిన ముత్యంలా బయటకు వస్తారని రాజేంద్రప్రసాద్ అన్నారు.
ఈ కార్యక్రమంలో తెదేపా బిసి సగర సాధికార రాష్ట్ర అధ్యక్షుడు జంపన వీర శ్రీనివాస్, 15వ వార్డు మాజీ అధ్యక్షులు మిక్కిలినేని రామ్మోహన్, శివ సాయి, అన్నమయ్య, ప్రసాదు, చైతన్యతదితరులు పాల్గొన్నారు.