Suryaa.co.in

Andhra Pradesh

వచ్చే ఎన్నికల్లో జగన్ తాట తీసి కారం రాద్దాం

జగన్ ఇచ్చింది 10 రూపాయాలు దోచింది…100 రూపాయలు
టీడీపీ వచ్చి ఉంటే అన్ని ప్రాజెక్టులు పూర్తి అయ్యేవి
రాష్ట్రంలో వ్యవసాయ శాఖను మూసేశారు
రైతును వెంటిలేటర్ పై పెట్టారు
కరెంట్ చార్జీలు 8 సార్లు పెంచారు
ఒక్కో ఇంటిపై కరెంట్ బిల్లు భారం రూ. 8 వేల నుంచి 30 వేల వరకు పడుతుంది
అధికారంలోకి వచ్చిన తరువాత చార్జీలు పెంచను
రైతు మెడకు సీఎం ఉరితాడు వేస్తున్నాడు
మహిళలకు ఆర్టీసి బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తాం
రైతులకు అన్నదాత పథకం కింద ఏడాదికి రూ.20,000 ఇస్తా
ఓబులాపురం దోపిడీకి కాపు కాసే వ్యక్తి ఈ కాపు రామచంద్రారెడ్డి
బాబు ష్యూరిటీ – భవిష్యత్ కు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా రాయదుర్గం లో నారా చంద్రబాబు నాయుడు

నేను చాలా సార్లు రాయదుర్గం వచ్చాను. కానీ నేటి జన స్పందన చూసి చెపుతున్నా వైసీపీ పని అయిపోయింది. ఈ రోజు రాయదుర్గంలో చెపుతున్నా వైసీపీని చిత్తు చిత్తుగా ఓడించి భూ స్థాపితం చేద్దాం. నా కోసం కాదు…ఈ రాష్ట్రం కోసం..నా యువత కోసం…నా రైతుల కోసం…నా కష్టజీవుల కోసం…నా ఆడబిడ్డల కోసం…జగన్ ను ఓడించాలి అని కోరుతున్నా.

జగన్ ఒక చాన్స్ అంటే నమ్మారు..ముద్దులకు మురిసిపోయారు…తలమీద చే యిపెడితే కరిగిపోయారు…ఒక సారి చాన్స్ అంటే మోసపోయారు. రాయదుర్గం తక్కువ వర్షపాతం ఉండే ప్రాంతం.కొంచెం నీరు ఇస్తే బంగారం పండించే రైతాంగం ఉన్నారు. పంటలు దెబ్బతింటే రైతును ఆదుకోవడానికి ఇన్ పుట్ సబ్సిడీ, వాతావారణ ఆధారిత బీమాను తెచ్చిన పార్టీ తెలుగు దేశం పార్టీ.

రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ, బీమా…రెండూ ఇచ్చిన పార్టీ తెలుగు దేశం పార్టీ. నేడు బీమా లేదు…ఇన్ పుట్ సబ్సిడీ లేదు. కొండ నాలుకకు మందేస్తే …ఉన్న నాలుకపోయినట్లు అయ్యింది. నేనే రైతు వాటా కూడా కట్టి బీమా చేస్తాను అన్నాడు. దాన్ని నాశనం చేశాడు. మళ్లీ పాత పంట బీమా పథకం తెస్తాను. రైతాంగాన్ని ఆదుకుంటాను.

రాయలసీమ ఎడారి కాకుండా….భగీరథ ప్రయత్నంతో గోదావరి నీళ్లు తేవాలని ప్రయత్నం చేశాను. నాడు ఇరిగేషన్ పై 68 వేల కోట్లు ఖర్చు చేశాం. జగన్ కేవలం 22 వేల కోట్లు ఖర్చు పెట్టాడు. జగన్ రామలసీమకు మొత్తం కలిపి 2 వేల కోట్లు మాత్రమే ఖర్చు పెట్టాడు. ఇతను రాయలసీమ ద్రోహి కాదా? బైరివానితిప్ప ప్రాజెక్టు కు నాడు రూ. 970 కోట్లు కేటాయించాను. పనులు చేశాను. సిఎం 4 ఏళ్లలో ఆ ప్రాజెక్టు పనులు కూడా పూర్తి చెయ్యలేదు.

గొల్లపల్లి పూర్తి చేసి ఈ జిల్లాకు కియా పరిశ్రమ తెచ్చాను. కియా పరిశ్రమతో ఆ ప్రాంత రూపురేఖలు మారిపోయాయి.చెర్లోపల్లి, ఉంతకల్లు, మడకశిర బ్రాంచ్ కెనాల్ పనులు మనమేం చేశాo. టీడీపీ వచ్చి ఉంటే అన్ని ప్రాజెక్టులు పూర్తి అయ్యేవి. రాయల సీమలో 102 ప్రాజెక్టులను జగన్ అధికారంలోకి రాగానే రద్దు చేశాడు. ఒక్క అనంతపురంలోనే 32 ప్రాజెక్టులను రద్దు చేశాడు.

ఈ ఏడాది వర్షాలు పడలేదు…..పంటలు ఎండిపోయాయి….34 లక్షల ఎకరాల్లో సాగు నిలిచిపోయింది. రువు నివారణకు కనీస చర్యలు తీసుకోలేదు. నాడు మనం 90 శాతం సబ్సిడీతో మైక్రో ఇరిగేషన్ ఇచ్చాను. ఇప్పుడు ఆ పథకాలు అన్నీ నిలిపివేశారు. రాష్ట్రంలో వ్యవసాయ శాఖను మూసేశారు. రైతును వెంటిలేటర్ పై పెట్టారు.

అనంతపూర్ లో 2022లో రూ.1500 కోట్ల పంటనష్టం వస్తే…కనీసం 10శాతం కూడా రైతులకు పరిహారం చెల్లించలేదు. రాష్ట్రంలో రైతాంగం నేడు తీవ్ర నష్టాల్లో ఉన్నారు. ఎక్కువ అప్పుల్లో ఉన్న రైతులు మన రాష్ట్ర రైతులు కరెంట్ చార్జీలు పెంచి షాక్ మీద షాక్ ఇస్తున్నాడు. కరెంట్ చార్జీలు బరించే పరిస్థితిలో ప్రజలు లేరు. కరెంట్ చార్జీలు 8 సార్లు పెంచారు.రూ. 200 వచ్చే కరెంట్ బిల్లు రూ.800 వస్తుంది. రూ.1000 వస్తుంది.

ఒక్కో ఇంటిపై కరెంట్ బిల్లు భారం రూ. 8 వేల నుంచి 30 వేల వరకు పడుతుంది. కరెంట్ సరఫరాలోను ఇబ్బందులు…కోతలు. 2019లో 22 మిలియన్ యూనిట్ల కరెంట్ కొరత ఉంటేదాన్ని అధిగమించి మిగులు విద్యుత్ సాధించాం. నాడు కరెంట్ చార్జీలు పెంచలేదు…కరెంట్ కోతలు లేవు. మరి ఇప్పుడు కరెంట్ చార్జీలు ఎందుకు పెంచారు. నేడు ఇండస్ట్రీకి కూడా పవర్ హాలిడే ఇచ్చారు. రాష్ట్రంలో ఎప్పుడు కరెంట్ వస్తుందో…ఎప్పుడు పోతుందో కూడా తెలియడం లేదు.

అందుకే చెప్తున్నా…మీ భవిష్యత్ కు గ్యారెంటీ ఇవ్వడానికి వచ్చాను. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత చార్జీలు పెంచను అని హామీ ఇస్తున్నా కరెంట్ ఇవ్వడం లేదు కానీ…రైతు మెడకు సీఎం ఉరితాడు వేస్తున్నాడు తెలంగాణలో రైతుల మోటార్లకు మీటర్లు పెట్టడం లేదు. మరి జగన్ ఎందుకు మీటర్లు పెడుతున్నాడు.

వచ్చే ఎన్నికల్లో జగన్ తాట తీసి కారం రాద్దాం. నేడు చెపుతున్నా…జగన్ గెలిచే అవకాశం లేదు. ఒక వేళ ఏదైనా తప్పు చేస్తే మీ పై కరెంట్ భారం లక్ష అవుతుంది. రాష్ట్రంలో మద్యం రేట్లు ఎందుకు పెరిగాయి. మద్యపాన నిషేధం అన్నాడు….మద్యం రేట్లు పెంచాడు. నాణ్యత లేని మద్యం తెచ్చాడు బళ్లారిలో ఉన్న బ్రాండ్లు ఇక్కడ లేవు….తెలంగాణ లో ఉన్న మద్యం బ్రాండ్లు ఇక్కడ లేవు. మద్యం షాపుల్లో బిల్లులు ఎందుకు ఇవ్వడం లేదు. జగన్ షాపుల్లో మాత్రం డబ్బులే కట్టాలి. ఆన్ లైన్ లో తీసుకోరు.

ఒకప్పుడు రూ.60 ఉండే క్వార్టర్ రూ.200 అయ్యింది. అంటే రూ.140 దోపిడీ. రెండు క్వార్టర్లు దాటితే నెలకు 8 వేలు……ఏడాదికి లక్ష రూపాయలు గుంజుతాడు. అలాంటి జలగ ఈ జగన్. ఓటు అడిగే హక్కు వైసీపీకి లేదు. టీడీపీ కి మాత్రమే ఉంది. మీ దగ్గర మద్యం పేరుతో గుంజిన లక్ష వెనక్కి ఇచ్చి…అప్పుడు ఓటు అడగమని చెప్పండి. మద్య పాన నిషేదం చేసి…అప్పుడు ఓటు అడగమని చెప్పండి.

రాష్ట్రంలో ఇసుక దోపిడీకి అంతే లేదు. ఇసుక దోపిడీపై నాగేంద్ర అనే వ్యక్తి ఫిర్యాదు చేస్తే అతనిపై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేశారు. అతని ఫిర్యాదు ఆధారంగా ఎన్జిటి ఇసుక తవ్వకాలు నిలిపివేస్తూ ఆదేశాలు ఇచ్చింది. దానికి సమాధానం చెప్పని జగన్….లిక్కర్ బాటిల్స్ ఉన్నాయని దొంగ కేసు పెట్టి నాగేంద్రను అరెస్టు చేశారు.
ఎవరైనా సమాజం కోసం పోరాడితే తప్పుడు కేసులు…అరెస్టులు. ఇదేం న్యాయం? ఇక్కడ యువత ఉన్నారు…మీకు ఉద్యోగాలు వచ్చాయా…డిఎస్సి వేశారా? మరి చదువుకున్న పిల్లలు ఏం చేయాలి. ఈ రాష్ట్రంలో పుట్టిన పిల్లలు ఇతర రాష్ట్రాలకు వెళ్లి చిన్న చిన్న ఉద్యోగాలు చేయాల్సిన దుస్థితి
మద్యం, పెట్రోల్, నిత్యావసర వస్తువలు ధరలు అన్నీ పొరుగు రాష్ట్రం కంటే పెరిగాయి. కందిపప్పు నేడు రూ,200 అయ్యింది. నాడు నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించి భారం కాకుండా చేశాం. జగన్ ఇచ్చింది 10 రూపాయాలు దోచింది…100 రూపాయలు. అందుకే మీకు నమ్మకం ఇవ్వడానికి వచ్చాను….అదే బాబు ష్యూరిటీ…భవిష్యత్ కు గ్యారెంటీ.

జగన్ మూడురాజధానులు అంటూ మూడుముక్కల ఆట ఆడుతున్నాడు. మన రాజధాని ఏది అని జగన్ ను అడగండి. రాజధాని లేకుండా చేసిన దుర్మార్గుడు సైకో. రాష్ట్రాన్ని గాడిలో పెట్టి మీ పిల్లల భవిష్యత్ ను కాపాడే బాధ్యత నాది. ఒక్క చాన్స్ తోనే చాలా నష్టపోయాము. అందుకు మహిళల కోసం మహాశక్తి పథకం తెచ్చాను. నాడు అందరికీ అమ్మఒడి అన్నాడు. కానీ కోతలు పెట్టాడు. మనం వచ్చిన తరువాత ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం కింద ఏడాదికి రూ.15000 ఇస్తాను.

ఆడబిడ్డ నిధి కింద నెలకు రూ.1500 ఇస్తా.దీపం పథకం కింద మూడు ఉచిత సిలిండర్లు ఇస్తాం. అవసరం అయితే అదనంగా మరో సిలిండర్ ఉచితంగా ఇస్తా. మహిళలకు ఆర్టీసి బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తాం. ప్రతి ఆడబిడ్డను శక్తి వంతమైన మహిళగా మారుస్తా. జగన్ పాలనలో లా అండ్ ఆర్డర్ ఎక్కడా లేదు. గంజాయి బ్యాచ్ రౌడీ బ్యాచ్ వచ్చేసింది. ఆడబిడ్డలపై అఘాయిత్యాలు పెరిగిపోయాయి.

దారితప్పిన యువతను గాడిన పెడతాను. యువతకు యువగళం నిరుద్యోగ బృతి కింద నెలకు రూ.3వేలు ఇస్తా. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తా. నా బలం..నా సైన్యం ఈ యువతే. వారి కోసం పాటుపడతా. ముందస్తు ఎన్నికలు వస్తాయి అంటున్నారు. జమిలి ఎన్నికలు అంటున్నారు. ముందుగా ఎన్నికలు వస్తే జగన్ ను ముందే వదిలించుకోవచ్చు. ఎన్నికలకు 6 నెలలు సమయం ఉంది. మూడు నెలల్లో కూడా ఎన్నికలు రావచ్చు. వస్తే మంచిదే. రైతులకు అన్నదాత పథకం కింద ఏడాదికి రూ.20,000 ఇస్తాను.

అనంతపురంలో 14 సీట్లకు 14 సీట్లు గెలవబోతున్నాం.బిసిలు, పేదలు ఉండే జిల్లా. బిసిల కోసం ప్రత్యేక రక్షణ చట్టం తీసుకువస్తా. బిసిల రుణం తీర్చుకునే బాధ్యత నాది. తాగడానికి ఉచితంగా మంచినీరు సరఫరా చేస్తాం. పి4 విధానంతో రాష్ట్రంలో పేదరికం లేని సమాజం నిర్మిస్తాం. నియోజవకర్గంలో భైరివాని తిప్ప ప్రాజెక్టు పూర్తి కావాలి అంటే టీడీపీ గెలవాలి. ప్రాజెక్టు పూర్తి చేసే బాధ్యత టీడీపీ తీసుకుంటుంది.

ఉంతకల్లు ప్రాజెక్టు పనులు కూడా ఈ ప్రభుత్వం ముందుకు తీసుకువెళ్లలేదు. ఉంతకల్లు రిజర్వాయరుపై 2021 జులై 8న రాయదుర్గంలో సిఎం జగన్ ఇచ్చిన హామీ గాలికి కొట్టుకుపోయింది. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉంతకల్లు బ్యాలెన్సింగ్ రిజర్వాయరును నిర్మిస్తామని హామీ ఇస్తున్నాను.

గుమ్మఘట్ట మండలం గోనబావిలో రూ.24 కోట్లతో బీసీ బాలిక ఆశ్రమ పాఠశాల నిర్మాణం మొదలు పెడితే దానిని పూర్తి చేయలేకపోయారు. రాయదుర్గంలో బాలికల జూనియర్ కళాశాలకు స్థలం ఇచ్చి నిథులు మంజూరు చేస్తే ఈ చేతకాని ఎమ్మెల్యే నేటికీ భవనాలు సమకూర్చలేదు. డి.హీరేహాల్ లో ప్రభుత్వం జూనియర్ కళాశాల మంజూరైనా భవన నిర్మాణం పూర్తి చేయలేదు.

మాల్యం బ్రాంచ్ కాలవ, ఆవుల దట్ల బ్రాంచ్ కెనాల్ పనులు పూర్తి అయ్యి ఉంటే దాదాపు 37 వేల ఎకరాలకు సాగునీరు అందేది. వాటినీ అటకెక్కించారు.వేదవతి, హగరి నదుల్లో నాలుగు చోట్ల సబ్ సర్ఫేస్, సర్ఫేస్ డ్యాంలు తలపెట్టాం. భూపసముద్రం వద్ద సబ్ సర్ఫేస్ డ్యాం పనులకు వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా రాజేంద్రసింగ్ తో భూమిపూజ కూడా చేయించాం. వాటినీ ఆపేశారు.

ఎమ్మెల్యే కాపు పెద్ద కేటుగాడు. అతని అవినీతి బయటపెడతా.. వేదవతి,హగరి నది నుండి పక్క రాష్ట్రానికి ఇసుక తరలిస్తున్నారు. ఇటునుంచి ఇసుక అక్రమంగా తరలించి…అటునుంచి అక్రమ మద్యం తెస్తున్నారు.చిన్న చిన్న క్వారీల నుంచి చిన్న పరిశ్రల వరకు ఏది నడపాలన్నా ఎమ్మెల్యేకు కప్పం కట్టాల్సిందే. 48 క్వారీలను బెదిరించి స్వాధీనం చేసుకున్నారు. ఇది వీళ్ల అబ్బ సొమ్మా?

బొమ్మనహాల్ మండలం నేమకల్లులో ఎమ్మెల్యే అక్రమంగా క్వారీ పనులు చేస్తున్నాడు. దీంతో మైనింగ్ అధికారులు రూ.రెండు కోట్ల పెనాల్టీ విధించారు. దాన్ని చివరికి సెట్ చేసుకున్నారు. ఓబులాపురం దోపిడీకి కాపు కాసే వ్యక్తి ఈ కాపు రామచంద్రారెడ్డి. గనులు, క్వారీల అక్రమాల్లో ఎమ్మెల్యేకు విశేష అనుభవం ఉంది. దీంతో కుటుంబ సభ్యులు, గుమస్తాల పేరిట క్వారీ లీజులు పొంది అక్రమ మైనింగ్ సాగిస్తున్నాడు. ఇతరుల క్వారీలకు అనుమతులు రాకుండా ఒక్కడే మాఫియా నడుపుతున్నాడు.

ఇసుక, అక్రమ మైనింగ్, గ్రానైట్ కంపెనీ లు, లే అవుట్ యజమానుల నుంచి కమిషన్ లు, సెటిల్మెంట్లు, వసూళ్ల ద్వారా ఎమ్మెల్యే బాగా బలిసిపోయాడు. చివరికి హెచ్ఎల్ సీ కాలువకు మోటార్లు వేసుకున్న రైతుల నుంచి కూడా వసూళ్లకు పాల్పడ్డ ఘనుడు ఈ ఎమ్మెల్యే. రైతుల నుంచి కూడా రూ. 5 వేలు రూ.7 వేలు వసూలు చేశాడు.

నేను చిత్తూరు జిల్లా పర్యటనకు వెళితే నాపై దాడి చేసి….నాపైనే హత్యాయత్నం కేసుపెట్టారు. పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన చల్లా బాబుతో తప్పుడు అంగీకార పత్రం పై సంతకం చేయాలని పట్టుపట్టారు. అంగళ్లలో నా సూచనల మేరకు దాడి చేశాం అని రాసి సంతకం పెట్టమన్నారు.

LEAVE A RESPONSE