– స్కిల్ స్కాంలో సీఐడి అరెస్ట్ అక్రమమనుకుంటే.. సీబీఐ-ఈడి-ఐటీ విచారణ కోరండి
– చంద్రబాబు ఎప్పుడు నిజం చెప్పాడని నిజం గెలుస్తుంది?
– బాబు అవినీతిపరుడు అన్న నిజం ఇప్పుడు గెలిచింది
– ప్రజలకు నిజం తెలియకూడదు- గెలవకూడదనే భువనేశ్వరి యాత్ర
– చంద్రబాబు గొప్పోడని జనం చెప్పటంలేదు.. భువనేశ్వరి చెప్పుకోవడం విడ్డూరం!
– చెల్లి-మరిది కోసం నీతిబాహ్యమైన రాజకీయం చేస్తున్న పురంధేశ్వరి!
– ఆమె బీజేపీ అధ్యక్షురాలిగా కాకుండా మీడియేటర్‌గా పనిచేస్తున్నారు
– ఢిల్లీకి, నారావారాపల్లికి మధ్య పురందేశ్వరి రాయబారాలు
– మీ మరిది బాబు హయాంలో అనుమతించిన మద్యం బ్రాండ్లు- డిస్టలరీలే నేడూ ఉన్నాయ్..
– ఆరోగ్యం చెడిపోని మద్యం ఏమిటో వారే చెప్పాలి!
– ప్రభుత్వ మద్యం దుకాణాల్లో చెల్లింపులు అన్నీ పారదర్శకం-పైసా కూడా అక్రమం లేదు -:మంత్రి అంబటి రాంబాబు
బాబు అరెస్ట్ అక్రమైతే ఇంతవరకూ రిలీఫ్ ఎందుకు రాలేదో..?:
చంద్రబాబు రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆయనది అక్రమమైన అరెస్టు అని టీడీపీ, పవన్ కల్యాణ్ పదే పదే చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.
బాబు సతీమణి భువనేశ్వరి కూడా నిజం గెలవాలని, అక్రమంగా తన భర్తను రాజమండ్రి జైళ్లో నిర్భందించారని పదే పదే మాట్లాడుతున్నారు.
బాబు అరెస్ట్ చాలా సక్రమమైనది..చట్టబద్దమైన ది.
ఇది వారి కుటుంబ సభ్యులకు, బాబుతో ప్రయాణం చేయాలని భావిస్తున్న పవన్ కల్యాణ్‌కు బాధ కలిగించవచ్చు.
అరెస్ట్చేయడం అనేది సీఐడీ చేతిలో ఉంటుంది. 24 గంటల్లో న్యాయస్థానంలో ప్రవేశపెట్టాల్సి ఉంటుంది.
న్యాయస్థానం అది అక్రమైన అరెస్ట్ అనుకుంటే, చట్టబద్ధం కానిదైతే, కక్షసాధింపు అరెస్ట్ అయితే రిమాండ్ రిజెక్ట్ చేసేవారు. కానీ అలా జరగలేదు.
అలా రిమాండ్ రిజెక్ట్ చేయమని ఢిల్లీ నుంచి పెద్ద పెద్ద అడ్వకేట్లు కూడా వచ్చి అడిగారు.
అయినా ఏసీబీ కోర్టు ప్రాథమిక సాక్షాధారాలున్నాయని రిమాండ్‌కు పంపారు.
ఆ తర్వాత హైకోర్టు, సుప్రీం కోర్టులకు కూడా వెళ్లారు…అక్కడ కూడా రిమాండ్ సక్రమమే అనే మాటే వినిపించింది.
భువనేశ్వరిని, టీడీపీ వారిని, పవన్ కల్యాణ్‌ను అడుగుతున్నా…ఇది అక్రమమైన అరెస్ట్ ఎలా అవుతోంది..?
జగన్ గారిపై బురదజల్లాలనే ప్రయత్నంలోనే పథకం ప్రకారం ఇదంతా చేస్తున్నారు.
భువనేశ్వరికి అక్రమ అరెస్ట్‌గా కనిపించడం సహజం. భర్త అవినీతిపరుడైనా, దుర్మార్గుడైనా, కోటాను కోట్లు ఖజానా నుంచి దోచుకున్నా..భర్త కాబట్టి హిందూ స్త్రీగా నా భర్త గొప్పవాడు..దైవంతో సమానం అనుకుంటుంది. దాన్ని తప్పు పట్టడానికి వీళ్లేదు.
కానీ ప్రజలు కూడా అలానే భావించాలి అనుకోవడం చాలా దురదృష్టకరం.
నిజం గెలిచింది కాబట్టే బాబు జైళ్లో ఉన్నాడు:
సహజంగా టీడీపీ వారు ఏ ఉద్యమం చేయాలన్నా ఎన్టీఆర్ సమాధి నుంచి ప్రారంభించేవారు.
కానీ నిన్న నారావారిపల్లిలో చంద్రబాబు తల్లిదండ్రుల సమాధి నుంచి నిజం గెలవాలి కార్యక్రమం ప్రారంభించి ఎన్టీఆర్‌కి డుమ్మా కొట్టే ప్రయత్నం చేశారు. సరే అది వారిష్టం.
తన భర్తను అరెస్ట్ చేస్తే తెలుగు రాష్ట్రంలో కొందరు గుండెలు పగిలి చనిపోయారట.
155 మంది చనిపోయారంటున్నారు..అదొక విచిత్రమైన లెక్క..వాటి సంగతి, వాస్తవాలేమిటో ప్రజలందరికీ తెలుసు.
వారందరినీ పరామర్శించే కార్యక్రమంతో నిజం గెలవాలి అంటున్నారు.
నిజం గెలిచింది కాబట్టే.. చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైళ్లో ఉన్నాడు.
ఇంతకు ముందు నిజం ఓడిపోతూ చంద్రబాబు బయట తిరిగాడు.
మీరు నిజాలు గెలవాలి అని ఉద్యమాలు చేస్తే మరింతగా చంద్రబాబు ఉచ్చులో ఇరుక్కుంటాడు తప్ప బయటకొచ్చే ప్రశ్నే ఉండదు.
అబద్ధం గెలవాలి…అన్యాయం, అవినీతి గెలవాలి అని మీరు యాత్రలు చేస్తే మీకేమైనా ఉపయోగం ఉంటుంది. నిజం గెలిస్తే మాత్రం మీకు ఆవకాశం ఉండదు.
చంద్రబాబు ప్రజల కోసమే తన జీవితాన్ని అంకితం చేశాడని, 2014లో గెలిచిన తర్వాత తెలుగు రాష్ట్రాలను దేశంలోనే నంబర్ 1 స్థానానికి తీసుకెళ్లడానికి అహర్నిశలు పనిచేశాడని చెబుతున్నారు.
కేవలం 3–4 గంటలే నిద్రపోయేవాడని, ఆరోగ్యాన్ని కూడా లెక్కచేయకుండా రాష్ట్రం కోసం పనిచేశాడని భువనేశ్వరి చెప్తున్నారు.
ఆయన అంతగా అహర్నిశం కష్టపడితే ప్రజలు ఎందుకు ఆయన్ను 23 సీట్లకే పరిమితం చేసి తిరస్కరించారు?
ప్రజలు మీ నాటకాన్ని నమ్మలేదు..భువనేశ్వరి చెబుతున్నవన్నీ అబద్ధాలేనని తేలిపోతోంది.
కుటుంబాన్ని బాబు అశ్రద్ధ చేస్తే లోకేశ్‌కి మంత్రి పదవి ఎలా వచ్చింది..?:
కుటుంబాన్ని చంద్రబాబు ఎక్కడ అశ్రద్ధ చేశాడో భువనేశ్వరి చెప్పాలి.
మీ ఏకైక పుత్రుడు లోకేశ్‌ను ఏ అర్హత లేకపోయినా, సమాజం పట్ల అవగాహన లేకపోయినా, ఎక్కడా గెలవకపోయినా దొడ్డిదారిన తీసుకొచ్చి మంత్రిగా మూడు శాఖలు అప్పజెప్పారు.
ఇది కుటుంబం కోసం తాపత్రయం కాదా..? స్వార్ధం కాదా?
టీడీపీ ప్రారంభం నుంచి మీ పార్టీలో మోస్ట్ సీనియర్లుండగా…వాళ్లందరికన్నా చాలా గొప్ప పదవులు మీ అబ్బాయికి కట్టబెట్టాడు. ఇది ప్రజల కోసం చేసిన పనా..?
మీరేదో చంద్రబాబు జైళ్లో ఉన్నాడని మీరు బయటకు వస్తే సింపతీ వస్తుందనే భావనతో ఈ కార్యక్రమాలు చేస్తున్నారు.
నేను సవాల్ చేస్తున్నా…కేంద్ర ప్రభుత్వ సంస్థలైన సీబీఐ, ఐటీ , ఈడీలతో మీకున్న ఆస్థులపై విచారణకు సిద్ధంగా ఉన్నారా?
మీరు బయటకొచ్చి చాలా చాలా గొప్ప విషయాలు చెప్తున్నారు కదా..మీరు విచారణను ఆహ్వానించండి.
మీకు సీఐడీపై నమ్మకం లేకపోతే దేశంలో ఉన్నత విచారణ సంస్థలతో విచారణ జరిపించాలి.
చంద్రబాబు ఎప్పుడు నిజం చెప్పాడు..? కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు నిజం చెప్పాడా..?
టీడీపీలోకి వచ్చాక నిజం చెప్పాడా..? ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచినప్పుడు నిజం చెప్పాడా?
ఎన్టీఆర్ చనిపోయిన తర్వాతైనా నిజం చెప్పాడా?
తెలంగాణలో ఓటుకు నోట్ల కట్టలిచ్చి కొన్నప్పుడు నిజం చెప్పాడా? అమరావతిలో నిజం చెప్పాడా?
ఇవాళ అన్ని సాక్షాధారాలతో దొరికిపోయి రాజమండ్రి సెంట్రల్ జైళ్లో ఉండి…ఏ కోర్టు మీకు రిలీఫ్ ఇవ్వకపోవడంతో మీరు ఫ్రస్టేషన్లో ఉండి..అదంతా జగన్ గారిపై రుద్దాలనే ప్రయత్నం చేస్తున్నారు.
రాజకీయ కక్షతో జగన్‌గారిపై రుద్ది లబ్ధిపొందాలని తాపత్రయపడుతున్నారు.
నిజం గెలవాలి అంటే ఎక్కడ గెలుస్తుంది..? దాన్ని చంద్రబాబు ఎప్పుడో తొక్కిపెట్టాడు.
పురందేశ్వరి తాపత్రయమంతా మరిదిని, లోకేశ్ ను కాపాడుకోవాలనే:
ఎన్టీఆర్ ఇద్దరు కుమార్తెలు చాలా గొప్పగా మాట్లాడుతున్నారు.
భువనేశ్వరి, పురందేశ్వరిలు చాలా గొప్పగా మాట్లాడుతున్నారు.
పురందేశ్వరి అంటే మామూలు వ్యక్తి కాదు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా చేశారు.
నేడు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి రాష్ట్ర శాఖ అధ్యక్షులు.
ఆమె తాపత్రయం అంతా మరిదిని ఎలా కాపాడుకోవాలనేదే తప్ప బీజేపీని అభివృద్ధి చేద్దామనే ఆలోచన మాత్రం ఏ కోశానా లేదు.
లోకేశ్‌ను తీసుకెళ్లి అమిత్‌షాతో ఇంటర్వ్యూ ఇప్పించింది.
కిషన్ రెడ్డి స్పష్టంగా చెప్పాడు లోకేశ్ పదే పదే అడిగితే అపాయింట్మెంట్ ఇప్పించానని.
దీన్ని బట్టి ఎవరు వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారో అర్ధం చేసుకోవాలి.
లోకేశ్ ఢిల్లీలో ఉండి వ్యవస్థలను మేనేజ్ చేయాలని కాళ్లూ గడ్డాలు పట్టుకున్నా ఆ వ్యవస్థలు మేనేజ్ కాకపోతే మళ్లీ తిరిగి వచ్చాడు.
మాకు వ్యవస్థలను మేనేజ్ చేసే శక్తి ఉందా..? జగన్ కి వ్యవస్థలను మేనేజ్ చేసే అలవాటు లేదు.
అలాంటి ఉద్దేశం లేదు..ధర్మంగా పోవాలనే పద్దతిలోనే మేం వెళుతున్నాం.
కానీ లోకేశ్ మమ్మల్ని వ్యవస్థలను మేనేజ్ చేసి బెయిల్ రాకుండా చేస్తున్నారంటూ మాట్లాడటంలో నిజం లేదు.
రాష్ట్రంలో ఉన్న లిక్కర్ బ్రాండ్లన్నీ బాబు తెచ్చినవే
లిక్కర్‌స్కాం జరుగుతోందని, కోటాను కోట్లు మా ప్రభుత్వం కొల్లగొడుతున్నారని ఈనాడు, ఆంధ్రజ్యోతిలో రాసిన కథలను తీసుకెళ్లి విచారణ చేయాలని కేంద్రానికి పురందేశ్వరి ఇచ్చారు.
జగన్ శాసనసభలో కూడా స్పష్టంగా మద్యం విషయాన్ని చెప్పారు.
ఈ రాష్ట్రంలో మద్యం విషయంలో అత్యంత జాగురుకతతో వ్యవహరిస్తున్న ప్రభుత్వం వైఎస్సార్సీపీ ప్రభుత్వం.
రాష్ట్రంలో మొత్తం 20 డిస్టిలరీలున్నాయి..ఏ ఒక్క డిస్టిలరీకి కానీ, కొత్తగా బ్రాండ్లకు గానీ మా ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. మొత్తం 20 డిస్టలరీలు ఉంటే..
చంద్రబాబు కాలంలోనే 14 డిస్టిలరీకు అనుమతులిచ్చారు. మిగిలినవి అంతకు ముందున్న ప్రభుత్వాలు అనుమతులిచ్చాయి.
పర్మిషన్ ఇచ్చింది మీరు..అదే కంపెనీల్లో తయారవుతున్న మద్యం ప్రస్తుతం కూడా అమ్మకాలు జరుగుతున్నాయి.
కానీ పదే పదే మేమేదో కొల్లగొట్టే కార్యక్రమం చేస్తున్నామంటూ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు.
కొత్త కొత్త బ్రాండ్లకు జగన్ అనుమతి ఇచ్చారంటూ వాళ్లు చెప్పేది వాస్తవం కాదు. ఇది శాసనసభలో కూడా స్పష్టంగా చెప్పాం.
భూమ్ భూమ్ బీర్, ప్రెసిడెంట్ మెడల్, గవర్నర్ చాయిస్, పవర్‌స్టార్ 999..ఇలాంటి బ్రాండులన్నిటికీ అనుమతి ఇచ్చింది చంద్రబాబే.
వీటన్నిటిపై మసిపూసి మారేడుకాయ చేసే విధంగా జగన్ గారిపై దుష్ప్రచారం చేస్తున్నారు.
80 లక్షల మంది ఒక్కొక్కరు రూ.200 చొప్పున రూ.56 వేల కోట్ల మద్యం తాగుతున్నారని కాకి లెక్కలు చెబుతున్నారు .
జాతీయ కుటుంబ ఆరోగ్య నివేదిక ప్రకారం 40 లక్షల మంది మాత్రమే మద్యం తాగుతున్నారని చెప్పింది.
కానీ పురందేశ్వరి మాత్రం ఎక్కువ చేసే ప్రయత్నం చేస్తున్నారు.
మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మద్యం అమ్మకాలు తగ్గాయి..రేట్లు పెరిగాయి.
యనమల రామకృష్ణుడు బంధువులకు కూడా చంద్రబాబు అనుమతులిచ్చారు. వాటిలో మద్యాన్ని అమ్ముతున్నారు.
మా మీద పడితే ఎలా..? ఏకాడికి మరిదిని, చెల్లెలు కొడుకును కాపాడుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు.
పురందేశ్వరి బీజేపీ అధ్యక్షురాలిగా కాకుండా మీడియేటర్‌గా పనిచేస్తున్నారు.
ఢిల్లీకి నారావారిపల్లికి, ఢిల్లీకి వారి చెల్లెలకు మధ్యన రాయబారాలు నడిపే ప్రయత్నాలు చేస్తున్నారు. చంద్రబాబుపై
మాకు ఏవిధమైన కక్షలు, కార్పణ్యాలు లేవు..ఉండాల్సిన అవసరం లేదు.
ఉంటే ఎన్నికల్లో తేల్చుకుంటామే తప్ప అన్యాయంగా, అక్రమంగా అరెస్ట్ చేయాల్సిన అవసరం మాకు లేదు.
ప్రాథమిక సాక్షాధారాలు మెండుగా ఉన్నాయి..స్పష్టంగా దొరికిపోయిన కేసు.
ఈ కేసులో చంద్రబాబును అరెస్టు చేయడం తప్ప పోలీసులకు గత్యంతరం లేదు.
అలా చేయకపోతే చట్టబద్ధంగా పనిచేయడం లేదని లెక్క.
డిజిటల్ పేమెంట్ లేకపోతే అక్రమాలు జరిగినట్లేనా?:
తాగే వారు ఎక్కువగా కూలీ నాలీ చేసుకునే వారే..వారు ఆన్లైన్ పేమెంట్ చేయగలరా?
వచ్చిన డబ్బులో ఎక్కడా తేడా ఉండదు..ప్రభుత్వమే నిర్వహిస్తున్న మద్యం దుకాణాల్లో చట్టప్రకారం వ్యవస్థ నడుస్తోంది.
రాజకీయంగా ప్రభుత్వం మీద ఆరోపణలు చేసే వారు చేస్తుంటారు.
అవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కేవలం డిజిటల్ పేమెంట్స్ లేవు కాబట్టే స్కాం జరుగుతుందనడం విడ్డూరం.
అప్పు తెచ్చుకోవడం తప్పు అయితే..చంద్రబాబు ఎందుకు అప్పు తెచ్చాడు..?
మేం ఇచ్చిన మొత్తం హామీల్లో 99 శాతం పూర్తి చేశాం. మిగిలిన 2 శాతం ఇంకా పూర్తి కాలేదు.
ఆ 2 శాతంలో మద్యపాన నిషేదం కూడా ఒకటి. మద్యపానాన్ని నియంత్రించడంలో పూర్తిగా పనిచేస్తున్నాం. మద్యం తాగితే
ఆరోగ్యాలు చెడిపోతున్నాయంటూ చాలా మంది ఉపన్యాసాలు చెప్తున్నారు.
మద్యం తాగితే ఆరోగ్యం చెడిపోని మద్యం ఏమిటో వారే చెప్పాలి.
మద్యం తాగితే ఎవరికైనా ఆరోగ్యం చెడిపోతుంది.
మద్యం వల్ల ఆదాయం ప్రభుత్వానికి వస్తుందా..? మా జేబుల్లోకి వస్తుందా..?
పరిధి దాటి తాగితే లివర్ దెబ్బ తినకుండా ఉంటుందా..? వాటిపైనే మందు తాగితే ఆరోగ్యానికి హానికరం అని రాస్తారు.
ప్రజల ఆరోగ్యం పట్ల శ్రద్ధతోనే మేం మద్యం విక్రయాలను, షాపులను తగ్గించాం..బాబు విచ్చలవిడిగా పెట్టిన బెల్టు షాపులను రద్దు చేశాం.
మీ మద్యం తాగడం వల్ల ప్రజలు చెడిపోతున్నారు..మా మద్యం తాగడం వల్ల ప్రజలు బ్రహ్మాండంగా ఉన్నారంటే ఏమీ చేయలేం.
ఈ ప్రభుత్వం మద్యం మీద కానీ, మరో విధంగా కానీ స్కామ్‌లు చేయాల్సిన అవసరం మాకు లేదు.
చాలా పారదర్శకంగా మా పరిపాలన సాగుతోంది.
సీడబ్ల్యూసీ నిర్ణయాలే పోలవరం నిర్మాణంలో అమలవుతాయి:
పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేను అని నేను మంత్రి అయిన మరుక్షణమే చెప్పాను.
ప్రస్తుతం డయాఫ్రం వాల్ దెబ్బతిన్నది. నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్ వారు కూడా దీనిపై నివేదిక ఇచ్చారు.
దెబ్బతిన్న డయాఫ్రం వాల్‌పై ఎర్త్ కం రాక్‌ఫిల్ డ్యాం కట్టడం ప్రమాదకరం.
దీన్ని రిపేర్ చేయవచ్చు..కొత్తది కట్టాలి అనే వాదనలున్నాయి.
ఈ రెండు వాదనలు కేంద్రానికి పంపాము. ఈ ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వం నిర్మించాల్సిన ప్రాజెక్టు.
కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణలోనే ఇక్కడ పనులు జరుగుతాయి కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఆధిపత్యం చెలాయించదు.
సీడబ్ల్యూసీ నిర్ణయాలే ఇక్కడ అమలవుతాయి.
పోలవరం నిర్వాసితులకు పూర్తిగా పరిహారం అందేంత వరకూ కూడా ప్రాజెక్టులో నీళ్లు నింపేది ఉండదు. కేంద్రం డబ్బులివ్వాలి..మనం పంచాలి.
అంచనాలు పెరిగాయి..2017–18 రేట్ల ప్రకారం మేం అంచనాలు పెంచి పంపాము.
41.15 మీటర్ల వరకూ మొదటి దశ కింద రూ.30 వేల కోట్ల పైచిలుకు సీడబ్ల్యూసీ ఆమోదించింది.
క్యాబినెట్ ఆమోదం తర్వాత ఆ డబ్బు విడుదల అవుతుంది.