Suryaa.co.in

Andhra Pradesh

కూటమి ప్రభుత్వంపై దుష్ప్రచారం తగదు

– తల్లికి వందనం పథకం ద్వారా 67.27 లక్షల మంది విద్యార్థులకు మేలు
– జిల్లా టీడీపీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్ కుమార్

కాకినాడ: కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను నెరవేర్చడంలో మొదటి దశలోనే తల్లికి వందనం పథకం కింద 67.27 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూర్చిందన్నారు. గత పాలనలో ఈ పథకం కేవలం 42 లక్షల మందికి మాత్రమే పరిమితమైందని, ఇప్పుడున్న ప్రభుత్వ హస్తక్షేపంతో ప్రతి విద్యార్థికి మేలు జరుగుతున్నదని జిల్లా టీడీపీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్ కుమార్ తెలిపారు.

“ప్రతిపక్ష వైకాపా నాయకులు బాధ్యతారహితంగా దుష్ప్రచారం చేస్తూ ప్రజల అవగాహనను తప్పుదారి పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ప్రజలు ఇప్పటికే వారి అసత్య ప్రచారాన్ని తిరస్కరిస్తున్నారు,” అన్నారు. జగన్ పాలనలో అభివృద్ధి, సంక్షేమం అనే భావనలు లేకుండా, విధ్వంసం, అక్రమాలు, అన్యాయాలే కొనసాగించారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏడాదిలోపే రోడ్లు నిర్మాణం, సంక్షేమ పథకాల అమలుతో అభివృద్ధి కార్యక్రమాలను బలోపేతం చేశారని తెలిపారు.

LEAVE A RESPONSE