– ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
హైదరాబాద్: పేద ప్రజలకు అన్ని వేళలా అండగా నిలిచిన వ్యక్తి మాజీ మంత్రి పి.జనార్దన్ రెడ్డి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు. పీజేఆర్ వర్ధంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి ముఖ్యమంత్రి పూలమాల వేసి నివాళులర్పించారు. 1994 నుంచి 1999 వరకు సీఎల్పీ నేతగా ఆయన పని చేసిన ఆయన నిత్యం ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాడారని, తెలంగాణ వాదానికి బలమైన గొంతుకగా నిలిచారని సీఎం తెలిపారు.