Suryaa.co.in

Andhra Pradesh

రాష్ట్రంలో మార్పుకు శ్రీకారం చుట్టనున్న బద్వేలు ఎన్నికలు

-భాజపా రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు
బద్వేలు ఉప ఎన్నికలో ఓటర్లు ప్రభుత్వానికి బుద్ధిచెప్పనున్నారని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు స్పష్టంచేశారు. రాజంపేటలో గురువారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, భారతీయ జనతా పార్టీ నాయకులు, శ్రేణులు బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన అన్ని మండలాల్లో పర్యటించి ఇంటింటికి వెళ్లి రాష్ట్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేకవిధానాలు, అవినీతి, అక్రమాలు, వనరుల దోపిడి గురించి వివరించామన్నారు. అలానే ప్రస్తుత అధికార పార్టీ లక్ష ఓట్ల మెజార్టీ తో గెలుస్తామని ప్రగల్భాలు పలికిన నాయకులు ఈ ఉప ఎన్నికల్లో ఐదు వందలనుంది వెయ్యి రూపాయలు వరకూ పంచుతున్నారు ఇదేనా మీ నిజాయితీ…అలాగే మోదీ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, పథకాలు, అభివృద్ధి తెలియచేయడం జరిగిందన్నారు. ఓటర్లు భాజపా పట్ల సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఇప్పటికే బద్వేలు ప్రాంతంలో వైకాపా నేతల భూకబ్జాలు, రౌడీయిజం, గుండాయిజంతో విసుగు చెందిన ఓటర్లు ఈ ఎన్నికల్లో ఆ పార్టీకి బుద్ధిచెప్పేందుకు నిర్ణయించుకున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో పోలీసు బలగాలు కూడా పెద్దఎత్తున వచ్చి ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు ఓటర్లకు మంచి అవకాశాన్ని కలిగించాయన్నారు. ఇప్పుడు రాష్ట్రంలో ప్రజల చూపంతా బద్వేలు ఎన్నికల మీదే ఉందని, ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటర్లు పెద్ద మార్పును తీసుకువస్తున్నారని ఆశాభావం వ్యక్తంచేశారు. అయితే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే ఆలోచనతో ఉన్న వైకాపా తిరుపతి ఉప ఎన్నికల్లో సృష్టించిన భయానక వాతావరణాన్ని, దొంగ ఓట్ల ప్రహసనాన్ని ఇక్కడ కూడా అమలుచేసే ఎత్తుగడలు వేయనుందని అన్నారు. కాని భాజపా ఈ చర్యలను సమర్ధంగా ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉందన్నారు. ఓటర్లు ఈ అవకాశాన్ని వినియోగించుకుని రాష్ట్రంలో రాబోయే మార్పుకు శ్రీకారం చుట్టాలని కోరారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పోతుగుంట రమేష్, యువమోర్చా పట్టణ అధ్యక్షుడు ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE