Suryaa.co.in

Andhra Pradesh

అనంతవరం దీక్షా శిబిరం వద్ద బహుజన పొలికేక

అమరావతి రాజధాని పరిరక్షణ ఉద్యమం 650 రోజుల మైలు రాయిని చేరుకున్న సందర్భంగా అనంతవరం దీక్షా శిబిరం వద్ద బహుజన పొలికేక పేరుతో సభ నిర్వహించబడింది.
అమరావతి రాజధాని పరిరక్షణ ఉద్యమాన్ని మరింత శక్తివంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడానికి, ఆంధ్రప్రదేశ్ ఎదుర్కొంటున్న సమస్యలను – ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను, ప్రత్యేకించి బడుగు బలహీన వర్గాల సమగ్రాభివృద్ధిపై బలంగా గళం వినిపించే లక్ష్యంతో అమరావతి బహుజన జేఏసీ నాయకులు, 25 ఏళ్ళ పాత్రికేయ అనుభవం ఉన్న మిత్రులు పోతుల బాలకోటయ్య తన ఆధ్వర్యంలో “బికే కాలమ్” యూట్యూబ్ ఛానల్ ను ప్రారంభించారు. దాని ఆవిష్కరణ అనంతవరం వేదికగా జరిగింది.
మోడీ ప్రభుత్వం తెచ్చిన రైతాంగ వ్యతిరేక, ఆహార భద్రతకు ముప్పు తెచ్చిపెట్టే మూడు సాగు చట్టాలను రద్దు చేయాలని దేశ వ్యాప్తతంగా జరిగిన సార్వత్రిక సమ్మెలో అంతర్భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఆలూరి రఘునాధరావు అధ్యక్షతన జరిగిన సభలో ఆంధ్ర ప్రదేశ్ సమగ్రాభివృద్ధి అధ్యయన వేదిక సమన్వయకర్త టి.లక్ష్మీనారాయణ, అమరావతి రాజధాని పరిరక్షణ ఉద్యమ నేత వెలగపూడి గోపాలకృష్ణ ప్రసాద్, అమరావతి బహుజన జేఏసీ అధ్యక్షులు పోతుల బాలకోటయ్య, అమరావతి రైతు ఐక్యకార్యాచరణ కమిటీ కన్వీనర్ పువ్వాడ సుధాకర్, మహిళా జేఏసీ నాయకురాలు శిరీష, న్యాయవాది చిగురుపాటి రవీంద్రబాబు, మైనార్టీ నాయకులు ఫరూక్ షుబ్లీ, ఆలూరి యుగంధర్, తదితరులు ప్రసంగించారు.

LEAVE A RESPONSE