Suryaa.co.in

Telangana

బాపూజీకి భారత రత్న ఇవ్వాలి

– తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక బాపూజీ
– మంచిర్యాల జిల్లాకు బాపూజీ పేరు పెట్టాలి
– రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దిడ్డి ప్రవీణ్ కుమార్
– ఘనంగా ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 106 వ జయంతి
ప్రముఖ స్వతంత్ర సమరయోధుడు, మూడు తరాల ఉద్యమ నేత, తెలంగాణ జాతి పిత ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీకి భారత రత్న ఇవ్వాలి తెలంగాణ పద్మశాలి సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దిడ్డి ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. బాపూజీ 106 వ జయంతిని మహబూబ్ నగర్ జిల్లా పద్మశాలీ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దిడ్డి ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన చేనేత, జౌళి శాఖ మంత్రి పదవిని తృణప్రాయంగా రాజీనామా చేసిన గొప్ప నాయకుడు కొండా లక్ష్మణ్ బాపూజీని ఆయన గుర్తు చేశారు.
1969 లో తొలి దశ తెలంగాణ ఉద్యమంలో ఆయన కీలక పాత్ర పోషించారని, తెలంగాణ కోసం 1969 మార్చి 27న ఆయన మంత్రి పదవికి రాజీనామా చేశారని ఆయన తెలిపారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రo కోసం తన తుది శ్వాస వరకు పోరాటం చేశారని ఆయన కొనియాడారు. అంతేకాకుండా తెలంగాణ కోసం ప్రాధాన్యత ఇవ్వడంతో, పలు సార్లు ముఖ్యమంత్రి పదవి వదులుకున్నాడని ఆయన పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 7 సంవత్సరాలు కావస్తున్నా అసెంబ్లీ, పార్లమెంటు, మండలిలో పద్మశాలి సామాజిక వర్గానికి సరైన ప్రాతినిధ్యం కల్పించక పోవడం బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. స్వ రాష్ట్రంలో కూడా చేనేతల ఆకలి చావులు ఆత్మ హత్యలు ఆగలేదని ఆందోళన వ్యక్తం చేశారు… రాష్ట్ర వ్యాప్తంగా దళిత బందు మాదిరిగానే పద్మశాలి బందు కూడా ప్రవేశపెట్టి అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి 10 లక్షల రూపాయలు అందించాలని ఆయన డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లాకు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ పేరిట నామకరణం చేయాలని ఆయన కోరారు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 15 శాతం గా ఉన్న పద్మశాలియులు ఐక్యమత్య లోపంతో రాజకీయంగా ఎదగలేక పోతున్నారని ఇకనైనా రాజకీయలకు అతీతంగా పద్మశాలియులు ఏకం కావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ కి భారత రత్న అవార్డు కు తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అనంతరం బాపూజీ చిత్రపటానికి పలువురు నాయకులు పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం ఉపాధ్యక్షుడు సారంగి లాక్షికాంత్, కోశాధికారి వింజమూరి రవి, ప్రధాన కార్యదర్శి పుంజలా శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు కొంగరి అనిల్ కుమార్, పద్మశాలీ సంఘము సీనియర్ నాయకులు సారంగి వినయ్ కుమార్, మకాం మోహన్, నామాల నర్సింమయ్య (శ్యామ్), వివిధ బి. సి. సంఘము నాయకులు గోవర్ధన్ నాయక్, వర్డ గణేష్, సమీర్, రమేష్, వెంకటేష్, రఘు, ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE