– హనుమంతరావు పై చర్యలు తీసుకోవాలి
– ప్రభుత్వ చీఫ్ విప్ భానుప్రసాద్
బీ ఆర్ ఎస్ లో ఉన్న పెద్ద నాయకుడు, తెలంగాణ ఉద్యమం లో పనిచేసిన హరీష్ రావు పైన చేసిన వాఖ్యలు సరికాదు.ఒక రాజకీయ నాయకుడిగా, పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పని చేస్తున్న నాయకుడు హరీష్ రావు.కానీ రాజకీయ హోదా లో, పార్టీ లో ఉండి పార్టీ లైన్ దాటి మాట్లాడటం మంచిది కాదు.పార్టీ అధిష్టానం కచ్చితంగా హనుమంతరావు పై చర్యలు తీసుకోవాలి.వెంకటేశ్వర స్వామి సాక్షిగా తిరుమల లో ఇలా మాట్లాడటం ఏంటి?మీ గత చరిత్ర అందరికీ తెలుసు. మీ స్థాయి తెలుసుకొని మైనంపల్లి మాట్లాడాలి.
మైనంపల్లి రౌడీ లా మాట్లాడారు : ప్రభుత్వ విప్ ఎం ఎస్ ప్రభాకర్
తిరుమల వేదికగా, దేవుడు సాక్షిగా గుడి ముందు హరీష్ రావు పై మైనంపల్లి హన్మంతరావు మాటలు మంచిది కాదు.ఒక రౌడీ లాగా, బెదిరించే దోరణి లో మైనంపల్లి మాట్లాడారు.మీ పద్దతి మార్చుకోవాలి. మీ వాఖ్యలు ఖండిస్తున్నాం.హరీష్ రావు కు, పార్టీ అందరికీ క్షమాపణ చెప్పాలి. పార్టీ సెక్రెటరీ జనరల్ కు ఫిర్యాదు చేస్తాం. ఆయన పై చర్యలు తీసుకోవాలని కోరుతాం.