మద్యం అక్రమ రవాణాకు చెక్ పెట్టండి

-గోవా, హర్యానా, ఢిల్లీ నుంచి వచ్చే లిక్కర్‌ను అడ్డుకోండి
-అధికారులకు మంత్రి శ్రీనివాసగౌడ్ ఆదేశం

ఇతర రాష్ట్రాలైన ముఖ్యంగా గోవా, హర్యానా, ఢిల్లీ మొదలైన రాష్ట్రాల నుండి తెలంగాణ రాష్ట్రానికి అక్రమంగా.. ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టే విధంగా మద్యాన్ని అక్రమంగా సరఫరా అవుతున్న మద్యాన్ని నియంత్రించుటకై గతం వారం రోజులుగా మధ్య నిషేధ & ఎక్సైజ్ శాఖ అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి సుమారు 16 లక్షల విలువైన విలువైన మద్యాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది.

ఈ సందర్భంగా రాష్ట్ర ఎక్సైజ్, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు యువజన సర్వీసుల శాఖల మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ శంషాబాద్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన పత్రిక సమావేశంలో పాల్గొని అక్రమ రవాణాకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మంత్రి అధికారులను ఆదేశించారు.

ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో ప్రొహిబిషన్ & ఎక్సైజ్ అధికారులు పగడ్బందీగా అక్రమ మద్యాన్ని రాష్ట్రానికి రాకుండా , ప్రభుత్వ ఆదాయానికి గండిగొట్టే ముఠాలను, వ్యక్తులను ఎక్సైజ్ శాఖ అధికారులు, సిబ్బంది గుర్తించి వారిపై కేసు నమోదు చేసి అక్రమ మద్యం రాష్ట్రాన్ని రాకుండా గట్టి చర్యలు చేపట్టాలని మంత్రి సందర్భంగా అధికారులను ఆదేశించారు.

శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో గత వారం రోజుల నుండి చేసిన స్పెషల్ డ్రైవ్ లో భాగంగా క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించి 85 కేసులు నమోదు చేసి 81 మందిని అదుపులోకి తీసుకోవడం జరిగిందన్నారు మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్. వీరి నుండి 16 లక్షల 24 వేల 767 రూపాయల విలువైన 1032 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. కుత్బుల్లాపూర్ స్టేషన్ పరిధిలో రెండు కేసులు నమోదు చేసి 15 మందిని అరెస్ట్ చేయడం జరిగిందన్నారు. వీరి నుండి 30 లక్షల విలువైన హర్యానా రాష్ట్ర మద్యం 1600 లీటర్లు ను స్వాధీనం చేసుకోవడం జరిగిందని వెల్లడించారు.

ఈ దాడులలో నకిలీ మద్యాన్ని సరఫరా చేసేందుకు ఉపయోగిస్తున్న కంటైనర్ తో పాటు 3 కార్లు, 2 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. అదేవిధంగా, సరూర్ నగర్, మల్కాజ్ గిరి స్టేషన్ల పరిధిలో అక్రమంగా అమ్మకాలు జరుపుతున్న 350 లీటర్ల మిలటరీ మధ్యాన్ని స్వాధీనం చేసుకొని 11 మంది పై కేసులు నమోదు చేసి 29 మంది నదులలో తీసుకోవడం జరిగింది.

విదేశాల నుండి వచ్చే ప్రయాణికులు డ్యూటీ ఫ్రీ షాప్ నుండి కొనుగోలు చేసిన 2 లీటర్ల విదేశీ మద్యాన్ని కలిగి ఉండవచ్చు అన్నారు. రాష్ట్రంలోని లైసెన్స్ దుకాణాల ద్వారా కొనుగోలు చేసిన 4.5 లీటర్ల మద్యాన్ని, 7.5 లీటర్ల బీర్లను కలిగి ఉండవచ్చని మంత్రి వెల్లడించారు. అంతకుమించి ఎవరి దగ్గరైనా మద్యం లభిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇతర రాష్ట్రాల్లో పర్యటించి రాష్ట్రానికి వచ్చేటప్పుడు మద్యాన్ని తీసుకొని వచ్చే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి సందర్భంగా హెచ్చరించారు. స్పెషల్ డ్రైవ్ లో పాల్గొని సమర్థవంతంగా అక్రమ మద్యాన్ని అరికడుతున్న ఎక్సైజ్ శాఖ అధికారులను ఈ సందర్భంగా మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ అభినందించారు.

తాజాగా ఈరోజు ఉదయం జరిపిన మెరుపు దాడుల్లో 245 అక్రమ మద్యం బాటిలను స్వాధీనం చేసుకొని ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని అధికారులు తెలిపారు. శంషాబాద్ ఎయిర్పోర్టులో నిరంతర నిఘా ఉంచి దాడులు చేయాలని మంత్రి సందర్భంగా అధికారుల ను ఆదేశించారు.
ఈ సమావేశంలో రాష్ట్ర ప్రొహిబిషన్ & ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు డిప్యూటీ కమిషనర్ డేవిడ్ రవికాంత్ సహాయ కమిషనర్ చంద్రయ్య శంషాబాద్ ఈ ఎస్ ఏ సత్యనారాయణ ఎస్ హెచ్ ఓ లు శ్రీనివాస్, గాంధీ నాయక్, టాస్క్ ఫోర్స్ అధికారులు వెంకటరెడ్డి, వారి సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply