సూర్యనారాయణన్నా…మరి ఇప్పుడూ కేసీఆర్‌ను పొగడాలి కదనే?

– జగనన్నకు ఎట్ల సలాం చేస్తవ్?
– కేసీఆరన్న ఇచ్చిన ఆ 30 శాతం కూడా జగనన్న ఇయ్యలేదు కదన్నా
– ఆంధ్రాలో కూడా బాంచెన్ కాల్మొక్త సిద్ధాంతమా ఏందీ?
( మార్తి సుబ్రహ్మణ్యం)

ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయిస్ యూనియన్ నేత సూర్యనారాయణ గుర్తున్నారా? అదేనండి.. గత చంద్రబాబు హయాంలో మా ఉద్యోగులకు 43 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చి, హైదరాబాద్ నుంచి వెలగపూడి వచ్చేందుకు కేంద్రంతో మాట్లాడి ఎంప్లాయిస్ ట్రైన్ వేయించినప్పుడు ఏమని సెలవిచ్చారో గుర్తుందా? ‘మన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారు 43 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చారు. ఎందుకిచ్చారు? మన

ముఖ్యమంత్రిగారికి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులపై అవ్యాజమైన ప్రేమతో ఇచ్చారా? లేకపోతే మన సంఘాల నేతల పోరాటపటిమ చూసి ఫిట్‌మెంట్ ఇచ్చారా? అలాంటి భ్రమలు మీకేమైనా ఉన్నాయా? అక్కడ తెలంగాణలో ఇచ్చారు. కాబట్టి ఇక్కడ ఏపీలో ఇవ్వాల్సివచ్చింది. కదా?.. కాబట్టి మనం కృతజ్ఞతలు చెప్పాలంటే ఎవరికి కృతజ్ఞతలు చెప్పాలి? కేసీఆర్‌కు కదా? మరి థ్యాంక్యూ సీఎం గారూ, మళ్లీ మీరే రావాలి అని మనం ఎందుకు సన్మానం చేస్తున్నాం?’ అని మైకులు పగలకొట్టిన మహానేత ఆయన. కావాలంటే ఈ వీడియో చూడండి. ది గ్రేట్ విప్లవ సూరన్న అప్పుడు ఏం మాట్లాడారో తెలుస్తుంది!
ఓకే..ఓకే.. అప్పుడు తెలంగాణ సీఎం కేసీఆర్ ఇచ్చారు కాబట్టి, అప్పటి సీఎం చంద్రబాబు 43 శాతం ఇచ్చారే అనుకుందాం. చంద్రబాబంటే మరీ పిరికి సీఎం కాబట్టి.. ఉద్యోగ నేతలు ఎప్పుడు కావాలంటే అప్పుడు అపాయింట్‌మెంట్ ఇచ్చి, లీడర్లను ఇంటి అల్లుళ్ల మాదిరిగా చూసుకున్నాడు కాబట్టి, ఉద్యోగులకు కోపమొస్తే తన పుట్టి ఎక్కడ మునుగుతుందో భయపడి, 43 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చారు కాబట్టి ఆయన ఆనాడు చేసింది దుర్మార్గం, ద్రోహం కావచ్చు. ఓకే.

కాబట్టి సూరన్న లెక్క ప్రకారమే అప్పుడు కేసీఆర్‌కు థ్యాంక్స్ చెప్పాలి. కరెస్టే! మరి ఇప్పుడు 23 శాతమే ఇస్తాం. అంతకుమించి ఇచ్చేది లేదు. మీ స్థాయికి మేమే ఎక్కువ. మీ ముఖాలకు సీఎంతో డైరక్టుగా చర్చించే స్ధాయా మీది? మీకు మేమే చాలా ఎక్కువ. నవరంధ్రాలూ మూసుకుని పడేసింది తీసుకోండి. లేకపోతే మీకు దిక్కున్నచోట చెప్పుకోమని పాలకపక్ష ప్రతినిధులు నిర్మొహమాటంగా చెబితే.. అదే మహాప్రసాదమని చెప్పి, జగనన్న దర్శనానికి వెళ్లి మరీ సలాములు చేసిన ఇదే సూరన్న అండ్ అదర్స్.. మరి ఇప్పుడు కూడా అదే కేసీఆర్‌కు ఎందుకు థ్యాంక్స్ చెప్పలేదు? అట్లా చెప్పడమే నైతిక ధర్మం కదా? తెలంగాణలో 30 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చిన కేసీఆర్‌కు కాకుండా, 23 శాతమే ఇచ్చిన జగనన్నకు ఎందుకు థ్యాంక్స్ చెప్పినట్లు చెప్మా? మరి నిజంగా అప్పటి సూరన్న మాటల ప్రకారం ఇప్పటికీ ఆంధ్రా ఉద్యోగ నేతలు, కేసీఆర్‌కే కదా థ్యాంక్స్ చెప్పాల్సింది?

సహజంగా ఎవరికయినా వెన్నుముక నిటారుగా ఉంటుంది. అది ఎవరికి పడితే వారికి లొంగదు. అలా లొంగటానికి ఆత్మసాక్షి ఒప్పుకోదు కూడా. సహజంగా ఇది ఆత్మాభిమానం ఉండే వారి విషయంలో కనిపిస్తుంటుంది. వివిధ పార్టీలో కొనసాగుతున్న చాలామంది సీనియర్ నాయకులు కూడా ఆత్మను చంపేసి, తమ అధినేతల కాళ్లపై సాష్టాంగపడుతుంటారు. కానీ కొందరు మాత్రం నిలువుగా, నిటారుగా, నిర్భయంగా నిలబడతారు. ఇందులో ఇప్పటి కొందరు ఆంధ్రా ఉద్యోగ సంఘ నేతలు ఏ ైటె పన్నది జనమే చెప్పాలి. వారి వెన్నుముక ఎంత బలమైనదో, ఎంత బలహీనమైనదో, ఎటంటే అటు వంగే రబ్బరు కూడా ఈర్ష్యపడే స్థాయిలో, అది ఎంత అల్పమైనదో.. ఈ పక్షం రోజుల్లో జరిగిన ఎపిసోడ్‌ను పరిశీలించిన బుద్ధిజీవులే తీర్పునివ్వాలి.

ఈ సందర్భంగా మా ఉద్యోగుల్లో జరుగుతున్న చర్చలు, అప్పటి బాబన్న-ఇప్పటి జగనన్న ఇచ్చిన వరాలు, అప్పటి-ఇప్పటి పరిస్థితుల గురించి మా మహానేత సూరన్న అండ్ అదర్స్ దివ్యసముఖానికి మాకున్న సందేహాలివి.

2014-2015 లో రాష్ట్ర బడ్జెట్ ఒక్క లక్షా 14 వేల కోట్లు ఉన్నప్పుడు 43% ఫిట్మెంట్ తో 106 శాతం జీతం (5 సం. కలిపి) పెరుగుదల జరిగినది. DA లు కలపకుండా ఒక్కొక్కరికి 50 వేల నుంచి 150000 రూపాయల పై దాకా అరియర్స్ ఇచ్చినటువంటి PRC.
కేవలం 12 నెలలు మాత్రమే నోషనల్ కాలం. అన్ని సౌకర్యాలు కొనసాగిస్తూ..
ఆరోజు ఆర్థిక కష్టాలు చూడు నారాయణా!!.

1. PRC fitment రోజుకు రాష్ట్రం 22 వేల కోట్ల లోటు లో ఉన్నది.
2. కనీసం లక్ష కోట్ల రూపాయలు పోలవరం తో సహా నీటిపారుదల పైన వెచ్చించాల్సిన సమయం. గరిష్ఠం వెచ్చించారు కూడా!
3.ప్రజలకు అవసరమైనటువంటి రాజధానిని వేల కోట్లతో నిర్మించవలసిన అవసరం. 10,000 కోట్ల పైన ఖర్చు…
4.రైతు రుణమాఫీ కింద ఒక్కొక్కరికి ఒక లక్షా 50 వేల వంతున 35 వేల కోట్ల రూపాయలు కావలసిన సమయం.
ప్రస్తుతం లాగే రెండు సంవత్సరాల తర్వాత వరకు PRC మరియు 5000 కోట్ల అరియర్స్ ఇవ్వకపోతే పాపం రైతులందరి రుణమాఫీ ఒకేసారి చేసి ఉండవచ్చు.మరి అలా ఎందుకు చేయలేదు!!
నారాయణా!!! మన PRC కోసం విడతల వారి విడుదల
5.వివిధ రకాల సంక్షేమ పథకాలకు లక్ష కోట్లకు పైగా ఐదు సంవత్సరాల్లో వెచ్చించవలసిన సందర్భం.
6.విభజన జరిగిన రాష్ట్రానికి కేంద్ర సహాయం అందని ద్రాక్షగా ఉండి అప్పుల కోసం అర్రులు చాచేటటువంటి సమయం.
7. రాష్ట్ర విభజన తర్వాత 50 వేల కోట్ల పైగా తెలంగాణ నుంచి ఆస్తులు మరియు ధన రూపేణా రావాల్సినవి ఎగ్గొట్టిన సమయం.
8. విభజన జరిగిన తర్వాత అవసరమైనటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ పోస్టులు నియమించుట కు అవసరమైనటువంటి ధన లభ్యత.
2 DSC లు కూడా పెట్టడం జరిగినది.
పైన కనబరచినటువంటి చాలా సమస్యలు గత ప్రభుత్వంలో తీరిపోయినవి.
ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే!
ఇన్ని లక్షల కోట్లు అవసరమైన సందర్భంలో గత ప్రభుత్వం ఇవేమీ లెక్క చేయకుండా 63% DAపైన + పిఆర్సి ఫిట్మెంట్ 43% ఇచ్చినది.
ఉద్యోగుల కోరిక న్యాయమైదిగా భావించినది.
ఆర్థిక కష్టాలు ఉన్నాయి నేను ఇవ్వను అంటే అప్పుడు సూర్యనారాయణ వచ్చి ఇప్పించి ఉండేవాడా! లేక కేసీఆర్ వచ్చి ఇప్పించి ఉండేవాడా? లేదా 43% ఫిట్మెంట్ అంతా కూడా కేసీఆర్ ఖజానా నుంచి ఏమైనా ఇచ్చాడా?మెదడు నిండా బురద నింపుకున్న వారు బురద మాటలకే అర్హులవుతారు.ధర్మాన్ని రక్షించండి. లేనప్పుడు అది మనల్ని రక్షించదు అని మరోసారి నిరూపించుకున్నారు.2021-2022 రాష్ట్ర బడ్జెట్ రెండు లక్షల 30 వేల కోట్లకు దగ్గరగా ఉంది.మరి ఇప్పుడు కేసీఆర్ ఇచ్చిన 30 శాతం కూడా తీసుకు రాలేదే?! అంటే మీ నోరు బాధ్యత కాదు భజనతో నిండిపోయిందా?

– ఓ ప్రభుత్వ ఉద్యోగి

Leave a Reply