యువత భవితను అంధకారంలో నెడుతున్న వైసీపీ ప్రభుత్వం

– యువత తలచుకుంటే ప్రభుత్వాలే కూలిపోతాయి
– మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు

సోమవారం తెదేపా మచిలీపట్నం పార్లమెంటు కార్యాలయంలో తెదేపా పార్లమెంటు తెలుగు యువత ఆధ్వర్యంలో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భాన్ని ఉద్దేశించి తెదేపా మచిలీపట్నం పార్లమెంటు అధ్యక్షులు మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు మాట్లాడుతూ…

నేటి వైసీపీ పాలకులు యువత భవిష్యత్తును అంధకారంలో నెట్టివేస్తున్నారని, యువత తలచుకుంటే ప్రభుత్వాలు కూలిపోతాయని వైసీపీ పాలకులు గ్రహించాలని అన్నారు.

మచిలీపట్నం తెలుగు యువత ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీని పటిష్ట పరిచే విధంగా, యువతకు ప్రజా వ్యతిరేక విధానాలపై అవగాహన కల్పిస్తూ, ప్రతి నియోజకవర్గంలో గ్రామ స్థాయి నుండి యువతను పటిష్టపరిచే విధంగా, తెలుగు యువత ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు చేస్తామని అన్నారు.

తెదేపా పోలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ… ప్రత్యేక హోదా వస్తే యువతకు ఉద్యోగాలు వచ్చి ఉపాధి అవకాశాలు మెండుగా వస్తాయని, ముఖ్య మంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే ప్రత్యేక హోదా విషయం మరిచిపోయి కేంద్ర వద్ద మెడలు వంచి యువత భవిష్యత్తును నిర్విర్యం చేస్తున్నారని మంది పడ్డారు.

తెదేపా లో తెలుగు యువత పాత్ర చాలా కీలకమైనది అని, నేను కూడా తెలుగు యువత నుండే మంత్రి స్థాయికి ఎదిగానన్నారు. మచిలీపట్నం పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాల తెలుగుయువత పార్టీని పటిష్ట పరిచే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకుని ముందుకు వెళ్లాలని తెలుగు యువత నాయకులకు సూచించారు. తెలుగుదేశం పార్టీలో కష్టపడి పనిచేసే ప్రతిఒక్కరికీ గుర్తింపు ఉంటుందన్నారు.

తెదేపా మచిలీపట్నం పార్లమెంటు ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ మాట్లాడుతూ… మచిలీపట్నం పార్లమెంటు పరిధిలో త్వరలోనే తెదేపా అనుబంధ అన్ని కమిటీలు పూర్తి చేసి, తెలుగుదేశం పార్టీ పటిష్టత కోసం పార్లమెంటు అధ్యక్షులు కొనకళ్ల నారాయణ రావు ఆధ్వర్యంలో కృషి చేస్తున్నామని అన్నారు. రాబోయే రోజుల్లో ప్రతి నియోజకవర్గంలో నాయకులు కష్టపడి పనిచేసి చంద్రబాబు ను ముఖ్యమంత్రిని చేయడమే మన అందరి లక్ష్యం అని అన్నారు.

తెదేపా మచిలీపట్నం పార్లమెంటు తెలుగు యువత అధ్యక్షులు దండమూడి చౌదరి మాట్లాడుతూ…మచిలీపట్నం పార్లమెంటు పరిధిలోని ఏడూ నియోజకవర్గాల్లో గ్రామ స్థాయి నుండి యువ భేరీలు నిర్వహించి యువతను చైతన్య పరుస్తూ తెలుగుదేశం పార్టీ పటిష్టత కోసం కృషి చేస్తామన్నారు.

మచిలీపట్నం పార్లమెంటు కమిటీలోని తెలుగు యువత భవిష్యత్తులో చేయబోవు కార్యక్రమాలను చర్చించుకుని తద్వారా తెదేపా పటిష్టతకు కృషి చేయనున్నట్లు తెలిపారు.సమావేశం అనంతరం తెలుగు యువత రాష్ట్ర కమిటీ నాయకులను సత్కరించారు.

ఈ సమావేశంలో మచిలీపట్నం పార్లమెంటు తెలుగు యువత ప్రధాన కార్యదర్శి వాలిశెట్టి విమనిష్ , తెలుగు యువత నాయకులు, మచిలీపట్నం పార్లమెంటు కార్యాలయ కార్యదర్శి బత్తిన దాసు , మచిలీపట్నం పార్లమెంటు ప్రచార కార్యదర్శి పి.వి ఫణికుమార్ , తదితరులు పాల్గొన్నారు.