బాంధవ్యాలు బాధ్యతలు

కుటుంబ బాంధవ్యాలలో మేనమామకి, మేనత్తకీ కొన్ని ప్రత్యేక పాత్రలున్నాయి. వారి అనుబంధమే ఎంతో అపురూపంగా ఉంటుంది.మేనమామ అంటే అమ్మ తోడబుట్టినవాడు. తండ్రి తరువాత బాధ్యత తీసుకోవకలసిన వాడు. నిస్సహాయ పరిస్థితులలొ, కష్టాలలో తండ్రి లేన్సప్పుడు కొంతవరకునైనా అండగా నిలబడి తనవంతు భాద్యత తనకు వీలుమన్నంతమటుకు నిర్వహించవలసిన వాడు. ఆడపిల్ల అయితే ఈడేరినప్పుడు మేనమామ బట్టలు పెట్టాలి. పెళ్ళికూతురికి కూడా మావయ్య చీర, జాకెట్టు పెట్టి, బుట్టలో కూర్చున్న మేనకోడలిని కల్యాణవేదికమీదికి తీసుకు రావాలి. అలాగే మగపిల్లలకి ఉపనయనం అయినప్పుడు వటువుకి బట్టలు పెట్టడం, కత్తేర వేయడం వంటి గురుతర బాధ్యతలు ఎన్నో ఉన్నాయి. అన్నింటికీ అధిక ధనం అవసరం లేదు. మనసులో అభిమానం, రవ్వంత బాధ్యత ఉంటే చాలు.

ఇంక మేనత్త. తండ్రి తోడబుట్టినది. రక్త సంబంధము కలది. అదొక అపురూప బంధం. అత్తా అనో, అత్తయ్యా అనొ అన్నదమ్ముల పిల్లలు వెనకాల తిరుగుతూ కబుర్లు చెప్తుంటే ఆ ఆనందం అనుభవించినవారికి తెలుస్తుంది. అయితే ఆ చనువూ చొరవ మేనత్తలు ఇస్తేనే సుమండీ.. మేనత్త పై ఇంటి కోడలు అయిపొతుంది కనుక ఆర్ధికంగా అస్వతంత్రురాలు కనుక ఘనంగా పెట్టుపోతలు చెయ్యలేకపోయినా ఆత్మీయత అభిమానం పంచి ఇవ్వవచ్చు. అత్తయ్యా అన్న పిలుపే ఎంతో మధురం అనిపిస్తుంది. ఈ అనుబంధాలు, ఆత్మీయతలు కొందరిలొ కానరావటం లేదు. ఎంత సేపూ సోదరుల పిల్లలలో దొషాలు ఎత్తి చూపడం, నిరసనగా మాట్లాడటం, ఎంత విపత్తు వచ్చినా ఆత్మీయంగా, సానుభూతిగా ఒక్క పలకరింపు అయినా లేకపోవడం..ఇలాంటివి ఈమధ్య చూస్తుంటే మనసు బాధగా అనిపిస్తూంది. వదినగారంటే పై ఇంటిది. అన్నదమ్ములు నీ రక్తం పంచుకు పుట్టినవారే, పిల్లలు నీకు సంబంధీకులే, మరెందుకు ఇంత ద్వేషం? కుటుంబమన్నాక ఎవో లోటుపాట్లు, ఎదైనా మాట జారడం ఉంటే ఉండొచ్చు. అంతమాత్రానికి అంత కక్ష కట్టి సాధించడం అన్నదమ్ముల్ని బధ్ధశత్రువులులా చూడడం సంస్కారం అనిపించుకుంటుందా?

Leave a Reply