కిడ్నీలో రాళ్లు వస్తే ఆంధ్రాలో హాస్పటల్ లేదారా?

44

-కరోనా వస్తే ఆంధ్రాలో హాస్పటల్ లేదారా?
-హైదరాబాద్ పారిపోయి వైద్యం చేయించుకునే నీకే జగన్ పాలనపై నమ్మకం లేదు
-రాష్ట్రంలో జగన్ పాలనపై నమ్మకం లేకనే హైదరాబాద్ వెళ్లి కిడ్నీ చికిత్స
-కొడాలి నానిపై దేవినేని ఉమ ఫైర్

మాజీ మంత్రి కొడాలి నానిపై టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ విరుచుకుపడ్డారు. . దేవినేని ఉమా ఏమన్నారంటే.. అరేయ్ కొడాలి నాని.. విశాఖపట్నంలో విజయలక్ష్మి గెలిచారా? జగన్మోహన్ రెడ్డి తన తల్లిని గెలిపించుకోలేక పోయాడు. విశాఖలో జగన్ మోహన్ రెడ్డి తల్లి విజయలక్ష్మి ఎంపీగా గెలిచిందా దరిద్రుడా. ఎమ్మెల్సీ వివేకానంద రెడ్డిని మీ జగన్ రెడ్డి ఏమైనా గెలిపించగలిగాడా? సొంత బాబాయిని కూడా గెలిపించుకోలేక పోయాడు.. తెలుసుకోరా దరిద్రుడా.

మీ నాయకుడి కన్నతల్లి విశాఖలో ఎందుకు ఓడిపోయింది చెప్పరా? మేము ఎప్పుడు అయినా వీటి పై మాట్లాడామా? నువ్వు కుప్పంలో పీకుతా, మంగళగిరి పీకుతా అంటావ్ దరిద్రుడా. నీకు చంద్రబాబు, లోకేష్ ఎందుకురా?నిన్ను తరిమి తరిమి కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి.తీసేసిన తహశీల్దారు నువ్వేంట్రా వాగేది? అరె బూతులు మంత్రి సిగ్గుందా రా నీకు?జగన్ రెడ్డి బూట్లు నాకే నువ్వారా టిడిపి గురించి మాట్లాడేది?మూడేళ్లు మంత్రి గా పని‌ చేయలేక పోయావు.

కిడ్నీలో రాళ్లు వస్తే ఆంధ్రాలో హాస్పటల్ లేదురా?కరోనా వస్తే ఆంధ్రాలో హాస్పటల్ లేదారా? హైదరాబాద్ పారిపోయి వైద్యం చేయించుకునే నీకె జగన్ పాలన పై నమ్మకం లేదు. ఒరేయ్ సన్న బియ్యం సన్నాసి.. పేదల బియ్యం కూడా దోచుకున్న ని దరిద్రుడువి నువ్వు.

పొద్దున లేస్తే చంద్రబాబుని లోకేష్ ని బూతులు తిడతావా? ఎన్నిసార్లు మీ బూతుల పంచాంగం వినాలిరా ?సన్న బియ్యం ఎప్పుడైనా ఇచ్చావురా సన్నాసి? మీ బూతులు విని విని మీడియా కి కూడా బోర్ కొట్టేసింది రా దరిద్రుడా.నువ్వు కనిపిస్తే టివీలు కూడా కట్టేస్తున్నార్రా.గుడివాడలో నీకు పోయేకాలం వచ్చింది అందుకే భయంతో చస్తున్నావు.

చాలా మంది పీకుతాం అన్నారు… నువ్వు పీకేదేంట్రా?14 ఏళ్లు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి.తెలుగుదేశం పార్టీ గురించి నువ్వు ఏంట్రా మాట్లాడేది బడుద్దాయి. రెండుసార్లు బీఫామ్ తీసుకుని తెలుగుదేశం పార్టీలో గెలిచావురా. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు లేకపోతే నీకు ప్రజలు తగిన బుద్ధి చెబుతారు.