Suryaa.co.in

Telangana

కవితకు సోమవారం బెయిల్?

(వాసు)

ఎమ్మెల్సీ కల్వకంట్ల కవితకు సోమవారమే బెయిల్ మంజూరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆమె దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ సుప్రీంకోర్టులో సోమవారం విచారణకు రానుంది. వారం రోజుల పాటు ఢిల్లీలో హైలెవల్ సీక్రెట్ చర్చలు జరిపి వచ్చిన కేటీఆర్.. తెలంగాణ భవన్‌లో మీడియా ప్రతినిధులతో చేసిన చిట్ చాట్‌లో మెడికల్ గ్రౌండ్స్ పై కవితకు బెయిల్ వస్తుందన్న సంకేతాలు ఇచ్చారు.

వచ్చేవారం కవితకు బెయిల్ వస్తుందని.. ప్రాసెస్ లో ఉందని ఆయన చెప్పుకొచ్చారు. ఆయన చెప్పిన మాటల ప్రకారం..సాయంత్రానికి కవిత బెయిల్ పిటిషన్ సుప్రీంకోర్టులో లిస్టు అయినట్లుగా బయటకు వచ్చింది. కవిత పదకొండు కేజీల బరువు తగ్గారని .. హెల్త్ ఇష్యూస్ ఎక్కువగా ఉన్న కారణంగా మెడికల్ గ్రౌండ్స్ మీద బెయిల్ కోరితే.. కోర్టు సంతృప్తి పడితే.. మరో కేసులో అంటే ఈడీ కేసుల్లో కూడా బెయిల్ వచ్చినట్లే. అందుకే ఈ కోణంలో ప్రయత్నిస్తున్నారని అనుకోవచ్చు.

పదిహేడు నెలల పాటు జైల్లో ఉన్న సిసోడియాకు కూడా సుప్రీంకోర్టు బెయిల్ వచ్చింది. వచ్చే వారంలోనే కేజ్రీవాల్ కూడా బెయిల్ వస్తుందన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కామ్ సైజుకు.. నేతల్ని జైల్లో పెట్టిన సమయానికి పొంతన లేదన్న వాదన ఉంది.

వేల కోట్ల అవినీతి చేసిన వాళ్లు కూడా అంత కాలం జైల్లో ఉండలేదన్న భావన ప్రజల్లో వస్తోంది. కవిత కూడా మార్చి పదిహేనో తేదీన అరెస్టయ్యారు. మిగిలిన వారు అప్రూవర్లుగా మారితే బెయిల్ ఇచ్చేశారు. కవిత మాత్రమే జైల్లో ఉన్నారు.

LEAVE A RESPONSE