Suryaa.co.in

Andhra Pradesh

అభివృద్ధి, సంక్షేమంతోనే జగన్ కు బుద్ధి చెబుతాం

3వ డివిజన్ లో రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే గద్దె రామమోహన్

విజయవాడ: నారా చంద్రబాబునాయుడు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని ఆలోచనలు చేస్తున్నారని, జగన్మోహన్రెడ్డి మాత్రం ప్రజలకు అబద్ధాలను ప్రచారం చేసి మభ్యపెట్టాలని చూస్తున్నారని ఎమ్మెల్యే గద్దె రామమోహన్ అన్నారు.

రాష్ట్రాన్ని అభివృద్ధి పథకంలో పరుగులు పెట్టించడమే కాకుండా సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేసి జగన్ కు సరైన బుద్ధి చెబుతామని అన్నారు.

తూర్పు నియోజకవర్గ పరిధిలోని 3వ డివిజన్ కనకదుర్గా నగర్లో నాలుగు రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన కార్యక్రమం శనివారం జరిగింది. కనకదుర్గా నగర్ కాలనీ గణేష్ రోడ్డు, నగర కాలనీ 1, 9, 13 రోడ్ల సుమారు రూ.80 లక్షలతో చేపటిన నిర్మాణ పనులకు ఎమ్మెల్యే గద్దె రామమోహన్ హజరై భూమిపూజ చేసి పనులను ప్రారంభించారు

LEAVE A RESPONSE