-హిందూపురం పర్యటనలో బాలకృష్ణ
-వైసీపీ శ్రేణుల దాడిలో గాయపడ్డ టీడీపీ కార్యకర్తలకు పరామర్శ
-టీడీపీ కార్యకర్తల జోలికొస్తే ఖబడ్దార్ అంటూ వైసీపీ శ్రేణులకు హెచ్చరిక
ఓ వైపు టీడీపీ మహానాడు ఒంగోలులో జరుగుతుంటే… ఆ పార్టీ కీలక నేత, ప్రముఖ సినీ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ శుక్రవారం తన సొంత నియోజకవర్గం హిందూపురం పర్యటనకు వెళ్లారు. ఈ సందర్భంగా నియోజకవర్గ పరిధిలోని చిలమత్తూరు మండలం కొడికిండ గ్రామానికి చెందిన పార్టీ కార్యకర్తలను ఆయన పరామర్శించారు.
రెండు రోజుల క్రితం వైసీపీ శ్రేణుల దాడిలో గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్తలు నరసింహమూర్తి, రవిలు గాయపడ్డారు. స్థానిక టీడీపీ నేతల ద్వారా ఈ విషయం తెలుసుకున్న బాలకృష్ణ…వారిని పరామర్శించే నిమిత్తమే హిందూపురం వచ్చారు. ఈ సందర్భంగా గాయపడ్డ పార్టీ కార్యకర్తలకు భరోసా ఇచ్చిన బాలకృష్ణ… తమ పార్టీ కార్యకర్తల జోలికి వస్తే ఖబడ్దార్ అంటూ వైసీపీ శ్రేణులను హెచ్చరించారు. పార్టీ కార్యకర్తలకు కష్టమొస్తే అర్ధరాత్రి అయినా తాను వస్తానని బాలకృష్ణ చెప్పారు.