హైదరాబాద్: టి.యస్.పి.యస్.సి పేపర్ లీకేజీ ఘటనను నిరసిస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నిరసన దీక్ష చేపట్టారు. హైదరాబాద్‌లోని ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయం నుంచి గన్‌పార్క్ వద్దకు చేరుకున్న బండి సంజయ్. అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించారు.అనంతరం నిరసన దీక్ష ప్రారంభించారు.మరోవైపు గన్‌పార్కు వద్దకు పోలీసులు చేరుకున్నారు.బండి సంజయ్ దీక్షకు అనుమతిలేదని చెప్పారు.ఈ నేపథ్యంలో వారిని అక్కడి నుంచి వెళ్లమని చెప్పారు.ఈ క్రమంలో బీజేపీ నాయకులకు పోలీసులకు మధ్య వాగ్వాదం తలెత్తింది.ఈ తరుణంలోనే అక్కడి చేరుకున్న పోలీసులు.. బండి సంజయ్ ని అరెస్ట్ చేశారు.