Suryaa.co.in

Telangana

కేసీఆర్ చెవుల్లో నుండి రక్తం వచ్చేలా మోత మోగిస్తాం

– బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్
ఈనెల 9న హైదరాబాద్ లో వేలాది మందితో ‘డప్పుల మోత’ ఉద్యమం నిర్వహిస్తాం. కేసీఆర్ చెవుల్లో నుండి రక్తం వచ్చేలా మోత మోగిస్తాం. దళిత బంధు అమలు చేసేదాకా పోరాడతాం. ఈనెల 16న బీజేపీ ఆధ్వర్యంలో లక్షలాది యువతతో ‘నిరుద్యోగ మిలియన్ మార్చ్’. కేసీఆర్ మెడలు వంచి ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇచ్చేదాకా ఉద్యమిస్తం.
తెలంగాణలో రైతాంగం వరి పండించి తీరుతుంది…. కేసీఆర్ మెడలు వంచైనా సరే… వరి పంటనంతా కొనిచ్చి తీరుతం. రాష్ట్రంలో పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గించేదాకా ఉద్యమాలు కొనసాగిస్తాం…ఎల్లుండి నుండి ఆందోళనలు షురూ చేస్తున్నం… సీఎం కేసీఆర్ ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎదిరించి హుజూరాబాద్ ప్రజల ఆశీర్వాదంతో గెలిచి వచ్చిన ఈటల రాజేందర్ కు బీజేపీ రాష్ట్ర శాఖ తరపున హ్రుదయపూర్వక శుభాకాంక్షలు.
హుజూరాబాద్ లో బీజేపీ కార్యకర్తల సహనాన్ని పిరికితనంగా భావించిన సీఎంకు 30న జరిగిన పోలింగ్ లో బీజేపీ కార్యకర్తలు చూపిన తెగువ అసామాన్యం. బీజేపీ కార్యకర్తల పోరాటం మామూలు విషయం కాదు. వారు చూపిన తెగువ, పోరాటానికి నా హ్యాట్యాఫ్…..
ఈటల రాజేందర్ గెలుపులో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, విజయశాంతి, జితేందర్ రెడ్డి, గరికపాటి మోహన్ రావు, చంద్రశేఖర్, రఘునందన్ రావు సహా ఇక్కడున్న వారిందరి భాగస్వామ్యం ఉంది. ఓటుకు వేల రూపాయలిస్తుంటే తెలంగాణలో రాబోయే రోజుల్లో ఏం జరగబోతోందని నాతోసహా దేశమంతా ఆందోళన చెందింది.
దేశం కోసం, ధర్మం కోసం పోరాడే నాలాంటి వారు ఒకవేళ టీఆర్ఎస్ గెలిస్తే మాట్లాడేందుకు వెనుకాడేవాళ్లం. కానీ హుజూరాబాద్ ప్రజలు చూపిన దారి, ఇచ్చిన తీర్పుకు నా సెల్యూట్. హుజూరాబాద్ ప్రజల్లో తెలంగాణ రక్తం ప్రవహించేలా ఈటల రాజేందర్, బీజేపీ కార్యకర్తలు చేసిన కృషి ఎనలేనిది.
దేశమంతా హుజూరాబాద్ ప్రజల గొప్పతనాన్ని చర్చించుకుంటున్నరు. డబ్బుల ద్వారానే గెలవాలనే పార్టీలకు హుజూరాబాద్ ప్రజలు గుణపాఠం చెప్పిండ్రు. దుబ్బాకలోనూ రఘునందన్ ను టీఆర్ఎస్ అనేక ముప్పుతిప్పలు పెట్టిండ్రు. బీజేపీ కార్యకర్తలపై కేసులు పెట్టి వేధించిండ్రు. బీజేపీ కార్యకర్తలు రాత్రింబవళ్లు ఇంటింటికీ తిరిగి వారి దమ్ము ఏందో చూపిండ్రు.
కేసీఆర్…నీ సర్వేలేమైనయ్. ఫాంహౌజ్ కే పరిమితమైనవ్. అతి త్వరలో 2, 3 బై ఎలక్షన్స్ రాబోతున్నయని కేసీఆర్ కుట్రలకు తెరలేపిండు. ఇకపై ఎక్కడ ఉప ఎన్నికలొచ్చినా గెలిచేది బీజేపీనే. తెలంగాణ గడ్డపై ఎగిరేది కాషాయ జెండానే. హుజూరాబాద్ లో మంత్రులు గ్యాస్ సిలిండర్లు మోసినా…పెట్రోలు ధరలపై కేంద్రాన్ని బద్నాం చేసినా ప్రజలు బీజేపీ పక్షానే నిలిచిండ్రు.
అందుకే ప్రజల కోసం నరేంద్ర మోదీ ప్రభుత్వం పెట్రోలు ధరలు తగ్గించింది. పెట్రోలు పై రాష్ట్ర ప్రభుత్వం రూ.41లు దోచుకుంటున్న సంగతి హుజూరాబాద్ ప్రజలు తెలుసుకుని టీఆర్ఎస్ కు బుద్ది చెప్పిండ్రు. కేసీఆర్….ఇకనైనా పెట్రోలు ధరలు తగ్గించాలి. ధరలు తగ్గటించేదాకా ఊరూరా తిరిగి ఉద్యమిస్తాం. ఎల్లుండి నుండి పోరాటం చేస్తాం.
దేశంలో 22 రాష్ట్రాలు పెట్రోలు ధరలు తగ్గించినా తెలంగాణలో ఎందుకు ఇంకా తగ్గించడం లేదు? దళితుడ్ని సీఎం చేస్తానని, మూడెకరాల భూమి ఇస్తానని, నగరం నడిబొడ్డున అంబేద్కర్ విగ్రహం పెడతానని మోసం చేసినా దళిత సమాజం ఇన్నాళ్లు భరించింది.
దళిత బంధు పేరుతో మరోసారి మోసం చేయాలనుకుంటే దళిత సమాజం టీఆర్ఎస్ కు ఏ విధమైన గుణ పాఠం చెప్పిందో అర్ధం చేసుకోవాలి. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా దళిత బంధు పథకాన్ని అమలు చేయాల్సిందే. ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షలు ఇచ్చి తీరాల్సిందే.
అందుకోసం ఈనెల 9న సీఎం కేసీఆర్ చెవుల్లోనుండి రక్తం కారేలా వేలాది మందితో డప్పుల మోత ఉద్యమాన్ని చేయబోతున్నం. ఉద్యోగ నోటిఫికేషన్లు రాక నిరుద్యోగ యువత అల్లాడుతోంది. వారి బాధలు స్వయంగా విన్నా. కళ్లారా చూసిన. అర్ధాకలితో అలమటిస్తున్న రెండు అరటి పండ్లకు ఒకటి ఫ్రీ అంటూ కొందరు ఆఫర్ ఇస్తుంటే నా కళ్లలో నీళ్లొచ్చినయ్.
ఉప ఎన్నికలొచ్చినప్పడల్లా నోటిఫికేషన్లు అంటూ ఆశ చూపుతూ మభ్యపెడుతూనే ఉన్నరు. ఈనెల 16న బీజేపీ ఆధ్వర్యంలో లక్షలాది యువతతో ‘నిరుద్యోగ మిలియన్ మార్చ్’ చేసి చూపుతం. టీఆర్ఎస్ కు దమ్ముంటే అడ్డుకోవాలి. నోటిఫికేషన్లు ఇచ్చి తీరాల్సిందే….ఆనాడు ఉద్యమం కోసం బలిదానాలు చేసుకుంటే ఈనాడు ఉద్యోగాల కోసం ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి ఏర్పడింది.
కేసీఆర్ మెడలు వంచి తీరుతం. నోటిఫికేషన్లు వచ్చేదాకా పోరాడతాం… కేసీఆర్ పాలనలో నిజమైన తెలంగాణ ఉద్యమకారులందరికీ అవమానం జరుగుతూనే ఉంది. హుజూరాబాద్ లో బీజేపీ గెలుపుతోనైనా వారికి న్యాయం జరుగుతుందని వారంతా ఆశపడుతున్నరు. బీజేపీకి రుణపడి ఉంటామని వాళ్లు చెబుతున్నరు. తెలంగాణలో రైతాంగం వరి పండించి తీరుతుంది. కేసీఆర్ మెడలు వంచైనా వరి పంటనంతా కొనిచ్చి తీరుతం.
వానకాలం పంట అంతా కళ్లెల్లో ఉన్నా ఇఫ్పటిదాకా కొనుగోలు కేంద్రాలను ప్రారంభించని సీఎం కేసీఆర్…రైతుల ఉసురు తీస్తున్న సీఎం కేసీఆర్. రైతాంగాన్ని మోసం చేస్తే బీజేపీ ఊరుకునే ప్రసక్తే లేదు. నమ్మిన సిద్ధాంతం కోసం త్యాగాలు చేసిన చరిత్ర బీజేపీకుంది. 2023లో గొల్లకొండపై కాషాయా జెండాను ఎగరేసేదాకా విశ్రమించబోం. గడీల్లో బందీ అయిన తెలంగాణ తల్లిని విడిపించేదాకా బీజేపీ యావత్తు పోరాడుతుంది.

LEAVE A RESPONSE