Suryaa.co.in

Telangana

ఆర్.ఆర్.ఆర్ చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు : బండి సంజయ్

ట్రిపుల్ ఆర్ (RRR) సినిమాలోని ‘‘నాటు నాటు’’ పాటకు ఆస్కార్ అవార్డు లభించడం మర్చిపోలేని మధుర జ్ఝాపకం. విశ్వవేదికపై తొలిసారి భారతీయ సినిమా పాటకు ఆస్కార్ అవార్డు రావడం, అందులోనూ తెలుగు పాట ఆ ఘనత సాధించడం భారతీయులందరికీ ప్రత్యేకించి ప్రపంచంలోని తెలుగు వారందరికీ గర్వకారణం. ఇంత గొప్ప పాటను రాసిన చంద్రబోస్, సంగీతం అందించిన ఎం.ఎం.కీరవాణి, స్వరాలందించిన రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవతోపాటు RRR సినిమా చిత్ర యూనిట్ కు, ముఖ్యంగా తెలుగు సినిమాను ప్రపంచస్థాయికి చేర్చిన రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్ లకు నా శుభాకాంక్షలు.

LEAVE A RESPONSE