– తన ప్రత్యర్థులు నాశనం కావాలనుకుంటున్నడు
– గతంలో ఓ సీఎం ఇట్లనే చేసి ఆగమైపోయిన సంగతి కేసీఆర్ తెలుసుకోవాలి
– గోరక్షుకులపై పెట్టిన కేసులన్నీ ఎత్తేయాలి
– రాష్ట్రంలో గోవధ నిషేధ చట్టాన్ని అమలు చేయాలి
– బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ డిమాండ్
– కర్మన్ ఘాట్ హనుమాన్ ఆలయాన్ని సందర్శించిన బండి సంజయ్
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ కర్మన్ ఘాట్ లోని హనుమాన్ దేవాలయాన్ని సందర్శించారు. వేద పండితులు బండి సంజయ్ కు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఆలయంలో స్వామి వారికి బండి సంజయ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. బండి సంజయ్ రాకను పురస్కరించుకుని బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఆలయ సందర్శన అనంతరం బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. అందులోని ముఖ్యాంశాలు…
ప్రసిద్దిగాంచిన ఆంజనేయ స్వామిని దర్శించుకోవడం ఆనందంగా ఉంది. ఫిబ్రవరి 22న గోరక్షకులపై ఇక్కడే దాడి చేసి హత్యా చేసే కుట్ర చేశారు.అందుకే ఈ ఆలయాన్ని సందర్శించి గోరక్షుకులను, ధర్మ రక్షకులను కాపాడాలని ఆంజనేయ స్వామిని కోరుకున్నా.శాంతి భద్రతలను కాపాడాల్సిన సీఎం రాష్ట్రానికి శాంతి భద్రతల సమస్యను స్రుష్టిస్తున్నరు.
రాష్ట్రంలో నెంబర్ వన్ ద్రోహి కేసీఆర్… నిఖార్సైన హిందువని గొప్పలు చెప్పుకుంటున్నాడు. ఫాంహౌజ్ లో యంత్ర, తంత్ర పూజలు సీఎం చేస్తున్నాడు.ఇతరులు నాశనం కావాలని సీఎం తాంత్రిక పూజలు చేస్తున్నడు.
ఫాంహౌజ్ లో జరిగేవన్నీ యాంత్రిక, తాంత్రిక పూజలే.గతంలో ఓ సీఎం ఇట్లనే చేసిండు… చివరకు ఏమైందో కేసీఆర్ తెలుసుకోవాలి. సమాజ క్షేమం, హిందూ ధర్మం కోసం పూజలు చేసే వాళ్లు గోమాతను తొలుత పూజిస్తారు.అట్లాంటి గోమాతలను వధించే వారిని అడ్డుకునే గోరక్షకులను హత్య చేసే కుట్ర చేస్తున్నరు.
హోంమంత్రి ఉన్నాడో లేదో… ఆయనెవరో కూడా రాష్ట్ర ప్రజలకు తెలియదు. రోహింగ్యాలకు షెల్టర్ కల్పించడం తప్ప ఆయన చేసేదేమీ లేదు.గోరక్షకులను హత్య చేసే కుట్ర చేసిన వారిపై కేసులు పెట్టకపోవడం దారుణం.చివరకు గోరక్షకులపైనే పోలీసులు హత్య కేసు నమోదు చేసి జైలుకు పంపడం అన్యాయం. కేసీఆర్ పాలనలో సరిగా డ్యూటీ చేయలేకపోతున్నామని పోలీసులు బాధపడుతున్నరు.
రాష్ట్రంలో గోవధ నిషేధ చట్టాన్ని అమలు చేస్తారా? చేయరా? కేసీఆర్ చెప్పాలి.కేసీఆర్… ఎన్ని తాంత్రిక, యాంత్రిక పూజలు చేసినా మమ్ముల్ని ఏమీ చేయలేరని గుర్తుంచుకోవాలి.ఇప్పటికైనా గోవధ చట్టాన్ని అమలు చేయాలి. చెక్ పోస్టులను నిర్వహించాలి. గోమాతలను వధించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. కేసులు పెట్టి జైలుకు పంపాలి.గోరక్షకులపై పెట్టిన కేసులన్నీ ఉపసంహరించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. ఇవన్నీ అమలు చేసినప్పుడే కేసీఆర్ నిజమైన హిందువని భావిస్తాం.