మహిళా దినోత్సవం ఎందుకు జరుపుకుంటారు?

– ఎప్పుడు ప్రారంభమైనది?

దీని పుట్టుకకు 1908 లోనే బీజాలు పడ్డాయి…
తక్కువ పనిగంటలు,మెరుగైన జీతం..
ఓటు హక్కు కోసం న్యూయార్క్ సిటీలో 15 వేల మంది మహిళలు ప్రదర్శన చేశారు..
ఈ డిమాండ్ ను దృష్టిలో పెట్టుకొని 1909 నుంచి ఈ దినోత్సవాన్ని ప్రకటించింది.
ఈ దినోత్సవాన్ని అంతర్జాతీయ స్థాయిలో జరపాలని ఆలోచన ఒక మహిళదే (క్లారా జెట్కిన్).
అందుకు ఒక సదస్సును ఏర్పాటు చేశారు.20 దేశాల నుంచి ఈ సదస్సుకు 1000 మంది మహిళలు హాజరై క్లారా జెట్కిన్ ఆలోచనలను బలపరిచారు .
ఈ మహిళా దినోత్సవం తొలిసారిగా 1911 లో కొన్ని దేశాలలో నిర్వహించారు. ఈ సంవత్సరం జరిగేది 111 వ అంతర్జాతీయ మహిళా దినోత్సవం.
1975 వ సంవత్సరం నుండి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఐక్యరాజ్యసమితి అధికారికంగా అన్ని దేశాల్లో నిర్వహించింది.
కారణం లింగ సమానత్వం,ఎలాంటి పక్షపాతం,మూస ధోరణులు, వివక్ష లేని,ప్రపంచం కోసం సామాజికంగా,రాజకీయంగా, ఆర్థిక రంగాల్లో ,మహిళలు ఎంత మేరకు ఎదిగారో తెలుసు కొని వేడుక చేసుకునే రోజుగా ఈ మహిళా దినోత్సవం మారిపోయింది.
రష్యాలో మార్చి 8 సెలవు దినం.
1917 యుద్ధంలో రష్యా మహిళలు ఆహారం – శాంతి డిమాండ్ తో వెయ్యి మంది మహిళలు సమ్మెకు దిగారు. నాలుగు రోజులలో 40 లక్షల మంది మహిళలు రష్యా వీధులలో సమ్మెను ఉధృతం చేశారు.ఎంతగా అంటే…
ఆ దేశ అధ్యక్షుడు కేవలం నాలుగు రోజుల్లో దేశం విడిచిపెట్టి పారి పోయేంతగా…….
చివరగా ఒకటి రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో కొన్ని కోట్ల మంది చనిపోయారు వీరంతా పురుష సైనికులే.కొన్ని కోట్లమంది అంగవికలురైనారు. వీరంతా పురుషులు.అయితే ఆ పురుషులు చేసే పనులన్నీ మహిళలే చేయవలసి వచ్చేది. విద్య,ఉద్యోగం,వ్యాపారం, కుటుంబం,సమాజం,తద్వారా దేశంలో అన్ని మహిళా శక్తితోనే నడిచాయి.దానికి గుర్తుగా మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము.

– రావు సుబ్రహ్మణ్యం,
నవతరంపార్టీ జాతీయ అధ్యక్షులు

Leave a Reply